Share News

Animal Kingdom: జంతు ప్రపంచంలో బెస్ట్ నాన్నలు ఇవే

ABN , Publish Date - Jun 07 , 2025 | 09:28 AM

Animal Kingdom: మనుషుల్లానే జంతువుల్లో కూడా పిల్లల బాధ్యత చాలా వరకు తండ్రిదే. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఐదు జంతువులు.. అడవిలో మిగిలిన జంతువుల కంటే ఎంతో నేర్పుగా.. ఓర్పుగా పిల్లల్ని సాకుతాయి.

Animal Kingdom: జంతు ప్రపంచంలో బెస్ట్ నాన్నలు ఇవే
Animal Kingdom

మనుషుల్లానే జంతువుల్లో కూడా పిల్లల బాధ్యత చాలా వరకు తండ్రిదే. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఐదు జంతువులు.. అడవిలో మిగిలిన జంతువుల కంటే ఎంతో నేర్పుగా.. ఓర్పుగా పిల్లల్ని సాకుతాయి. ప్రమాదాల నుంచి రక్షించి.. పెంచి పెద్ద చేస్తాయి. ఆ జీవులు ఏవి.. పిల్లల కోసం అవేంచేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..


1) పెంగ్విన్స్

ఆడ పెంగ్విన్స్ గుడ్లు పెట్టిన తర్వాత ఆహార వేట కోసం వెళ్లిపోతాయి. ఆ సమయంలో గుడ్లను మగ పెంగ్విన్స్ చూసుకుంటాయి. గుడ్లను తమ శరీరంతో కప్పేసి వెచ్చగా ఉండేలా చూసుకుంటాయి. ఒక వేళ ఆహార వేట నుంచి తల్లి తిరిగి వచ్చేలోగా.. గుడ్లు పొదిగితే తండ్రే వాటికి ఆహారం పెడతాడు. అది కూడా తన శరీరంలో దాచుకున్న ఆహారాన్ని వాటికి పెడతాడు. ఈ సమయంలో మగ పెంగ్విన్స్ ఆహారం తీసుకోవు. కేవలం పిల్లల్ని కాపాడటం కోసం మాత్రమే సమయాన్ని కేటాయిస్తాయి.

2) సీ హార్స్

ఆడ సీహార్స్.. మగ సీహార్స్ పౌచ్‌లో గుడ్లను పెడుతుంది. ఆ గుడ్లను మగ సీహార్స్ తన పౌచ్‌లో ఓ నెలపాటు మోస్తుంది. వందలాది పిల్లల్ని కంటుంది.

3) గోరిల్లాలు

గోరిల్లాల జాతిలో తండ్రులే కుటుంబానికి నాయకులు. ఆ తండ్రి గోరిల్లాలే కుటుంబానికి ఆహారం తెచ్చి పెట్టాలి. కుటుంబసభ్యులకు రక్షణ కల్పించాలి. పిల్ల గోరిల్లాలు పెరిగి పెద్దవి అయ్యే వరకు తండ్రి గోరిల్లా వాటికి రక్షణగా ఉంటుంది.


4) సింహాలు

ఆడ సింహాలు వేటకు వెళ్లి ఆహారం తెస్తే.. మగ సింహాలు తిని పెడతాయి. పిల్లల్ని పెంచటంలో మగ సింహాలు ఎంతో నేర్పుగా.. ఓర్పుగా ఉంటాయి. ప్రమాదాల నుంచి పిల్లల్ని ఎలా సురక్షితంగా ఉంచాలో వాటికి తెలుసు. అంతేకాదు.. పిల్ల సింహాలు ఎలా బతకాలో తండ్రినుంచే నేర్చుకుంటాయి.

5) ఎర్ర నక్కలు

మగ ఎర్ర నక్కలు పిల్లల్ని క్షేమంగా ఉంచటంతో పాటు జీవిత పాఠాలు కూడా నేర్పిస్తాయి. సాధారణంగా ఆడ నక్కలు పిల్లల్ని చూసుకోవడానికి వాటి నివాసంలోనే ఉండిపోతాయి. ప్రతీ రోజూ మగ నక్కలు ఆహారం తెచ్చిపెడతాయి. పిల్ల నక్కలు కొంచెం పెద్దగా అవ్వగానే .. తండ్రి వాటితో కలిసి ఆడుకుంటాడు. ఎలా ఆహారం సంపాదించాలో నేర్పిస్తాడు. ఆహారాన్ని ఓ చోట దాచి పెట్టి.. దాన్ని ఎలా కనిపెట్టాలో పిల్లలకు నేర్పిస్తాడు. వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడేలా చేస్తాడు.


ఇవి కూడా చదవండి

పుణ్య స్నానం చేద్దామనుకుంటే ప్రాణాల మీద కొచ్చింది..

హీరో విశాల్‌కు షాకిచ్చిన మద్రాస్ హైకోర్టు..

Updated Date - Jun 07 , 2025 | 09:59 AM