Mega Star Chiranjeevi: ఇదీ మెగాస్టార్ క్రేజ్ అంటే.. 1990లో ఒక టికెట్ రూ. 210..
ABN , Publish Date - May 04 , 2025 | 09:43 PM
Jagadeka Veerudu Athiloka Sundari: ఇక్కడ చిరు క్రేజ్ ఏంటో బయటపెట్టే విషయం ఒకటి జరిగింది. ఆ రోజుల్లో సినిమా టికెట్ ఆరు రూపాయల యాభై పైసలు. కానీ, సినిమా క్రేజ్‌ను క్యాష్ చేసుకోవటానికి బ్లాక్ మార్కెట్ దొంగలు రంగంలోకి దిగారు.

తెలుగు వెండి తెరపై మెగాస్టార్ చిరంజీవి సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. తెలుగు చిత్రపరిశ్రమలో చాలా విషయాల్లో ఆయనే ట్రెండ్ సెట్టర్‌గా నిలిచారు. ఆపద్భాందవుడు సినిమాకు కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుని బిగ్గర్ దన్ ది బచ్చన్ అనిపించుకున్నారు. దేశంలో ఆ టైంలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోగా చరిత్ర సృష్టించారు. ఇక, డ్యాన్సులో ఆయనకు ఆయనే సాటి అనిపించుకున్నారు. ప్రపంచరికార్డు సైతం క్రియేట్ చేశారు. అలాంటి మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ ‘ జగదేక వీరుడు అతిలోక సుందరి’.
కే రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించిన ఈ సినిమా 1990 మే 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా విడుదల సమయంలోనే రాష్ట్రంలో తుఫాను మొదలైంది. ఆ తుఫాను కారణంగా రాష్ట్రం అల్లాడిపోతోంది. అయినప్పటికి ‘ జగదేక వీరుడు అతిలోక సుందరి’ చిత్ర విజయం సాధించింది. జనాలు వానల్ని లెక్క చేయకుండా సినిమా హాళ్లకు వెళ్లారు. ఇక్కడ చిరు క్రేజ్ ఏంటో బయటపెట్టే విషయం ఒకటి జరిగింది. ఆ రోజుల్లో సినిమా టికెట్ ఆరు రూపాయల యాభై పైసలు. కానీ, సినిమా క్రేజ్‌ను క్యాష్ చేసుకోవటానికి బ్లాక్ మార్కెట్ దొంగలు రంగంలోకి దిగారు.
విజయవాడలో మొదటి రోజు మ్యాట్నీ షో టికెట్లు సాధారణ ధర కంటే 30 రెట్లు ఎక్కువకు అమ్మారు. టికెట్ ఆరు రూపాయలు అయితే.. ఏకంగా 210 రూపాయలకు బ్లాకులో అమ్మారు. అంత ఎక్కువగా ఉన్నా చాలా మంది చిరుకోసం టికెట్ కొని సినిమా చూశారంట. ఈ విషయాన్ని అప్పటి న్యూస్ పేపర్లలో కూడా వేశారు. ఈ సినిమా మే 9వ తేదీన మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్లలో 2డీ, 3డీలలో విడుదల కానుంది. మరి, రీరిలీజ్‌లో మెగాస్టార్ సూపర్ హిట్ సినిమా ‘ జగదేక వీరుడు, అతిలోక సుందరి’ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.
ఇవి కూడా చదవండి
Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడి.. వెలుగులోకి మరో వీడియో..
Viral Vide: ఓసీ పిల్ల నక్కా.. సింహంతో ఆటలా..