Jackie Chan Hoax: జాకీచాన్ చనిపోయాడంటూ వార్తలు.. అసలు నిజం ఏంటంటే..
ABN , Publish Date - Nov 11 , 2025 | 04:56 PM
హాలీవుడ్ సూపర్ స్టార్ జాకీచాన్ చనిపోయారంటూ గత కొద్దిరోజుల నుంచి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై జాకీచాన్ టీం స్పందించింది. ఓ క్లారిటీ ఇచ్చింది.
సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్‌ల అరాచకాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. సెలెబ్రిటీలే టార్గెట్‌గా కొంతమంది అసత్య ప్రచారాలు చేస్తున్నారు. బ్రతికున్న వారు చనిపోయారంటూ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. ప్రముఖ హాలీవుడ్ నటుడు, మార్షల్ ఆర్ట్స్ కింగ్ జాకీచాన్ చనిపోయారంటూ సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ వైరల్ అవుతోంది. ‘స్టోరీస్ ఎబౌట్ అజ్’ అనే ఫేస్‌బుక్ ఖాతా జాకీచాన్ గురించి ఓ పోస్టు పెట్టింది. ఆ పోస్టులో.. ‘ప్రపంచ సినిమాలో ఎంతో పేరు గాంచిన, మన హృదయాలు గెలుచుకున్న జాకీచాన్ చనిపోయారు’ అని ఉంది.
అంతేకాదు.. ఆ పోస్టులో జాకీచాన్ ఆస్పత్రి బెడ్‌పై పాండా బొమ్మను పట్టుకున్నట్లు ఫొటో కూడా ఉంది. ఆ పోస్టు చూసి కొంతమంది ఫ్యాన్స్ నిజంగా జాకీచాన్ చనిపోయారని అనుకున్నారు. కానీ, ఆ పోస్టు నిజం కాదని తేలింది. జాకీచాన్ క్షేమంగా ఉన్నారని ఆయన టీమ్ స్పష్టం చేసింది. ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. జాకీచాన్ టీం క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. తమ అభిమాన నటుడు క్షేమంగా ఉన్నందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ధర్మేంద్ర చనిపోయారంటూ..
బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర చనిపోయారంటూ నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై ఆమె కుమార్తె స్పందించి క్లారిటీ ఇచ్చారు. తన తండ్రి చనిపోలేదని స్పష్టం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. ‘మా నాన్న ఆరోగ్యంగా ఉన్నారు. మేం ప్రైవసీని కోరుకుంటున్నాము. నాన్న త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్న వారికి థ్యాంక్స్’ అని రాసుకొచ్చారు. ఇక, ఫేక్ న్యూస్‌పై ధర్మేంద్ర భార్య హేమామాలిని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి
బీట్‌రూట్ తొక్కల వల్ల ఇన్ని ఉపయోగాలా..?
పాక్‌లో బాంబు పేలుడు.. 12 మంది మృతి