Waving Pistol Shaped Lighter: బ్యాంకాక్ రోడ్డుపై ఇండియన్ పిచ్చిపని.. దెబ్బకు ఏడ్చేశాడు..
ABN , Publish Date - Oct 19 , 2025 | 07:10 AM
సాహిల్ రామ్ తడని కొద్దిరోజుల క్రితం బ్యాంకాక్ టూరుకు వెళ్లాడు. అక్టోబర్ 14వ తేదీ సాయంత్రం గంజాయి మత్తులో సియామ్ స్క్వయర్ సోయ్ 6లో ఉన్న నోవాటెల్ ముందు రచ్చ రచ్చ చేశాడు.
సరదాగా ఫ్రెండ్స్‌తో కలిసి వెకేషన్ వెళ్లడానికి భారతీయుల ఫస్ట్ ఛాయిస్ బ్యాంకాక్. తక్కువ ఖర్చులో టూరుకు వెళ్లివచ్చే అవకాశం ఉండటంతో భారతీయులు బ్యాంకాక్ వైపే మొగ్గుచూపుతున్నారు. తాజాగా, ఓ ఇండియన్ వ్యక్తి బ్యాంకాక్ టూరుకు వెళ్లాడు. గంజాయి మత్తులో రోడ్డుపై రచ్చ రచ్చ చేశాడు. పాదచారులను భయభ్రాంతులకు గురి చేశాడు. చేసిన తప్పుకు సరైన మూల్యం చెల్లించుకున్నాడు. పోలీస్ కేసులో ఇరుక్కుని జైలు పాలయ్యాడు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
ఇండియాకు చెందిన 41 ఏళ్ల సాహిల్ రామ్ తడని కొద్దిరోజుల క్రితం బ్యాంకాక్ టూరుకు వెళ్లాడు. అక్టోబర్ 14వ తేదీ సాయంత్రం గంజాయి మత్తులో సియామ్ స్క్వయర్ సోయ్ 6లో ఉన్న నోవాటెల్ ముందు రచ్చ రచ్చ చేశాడు. రోడ్డుపై వెళ్లే పాదచారుల్ని బూతులు తిట్టడం మొదలెట్టాడు. తుపాకి ఆకారంలో ఉండే లైటర్‌తో వారిని బెదిరించసాగాడు. కొంతమంది జనం భయంతో అతడి నుంచి పరుగులు తీయటం మొదలెట్టారు. ఇది గమనించిన హోటల్ సెక్యూరిటీ సిబ్బంది ఇద్దరు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.
ఓ చోట కూర్చోబెట్టారు. అయినా కూడా అతడు అరవటం ఆపలేదు. కొద్దిసేపటి తర్వాత మరో ఇద్దరు సెక్యూరిటీ గార్డులు అక్కడికి వచ్చారు. సాహిల్‌ను అక్కడినుంచి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో అతడు భయపడిపోయాడు. రానని మొండికేశాడు. కిందపడి ఏడవటం మొదలెట్టాడు. వారు అతడ్ని బలవంతంగా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై స్పందిస్తున్న ఇండియన్ నెటిజన్లు సాహిల్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇండియా పరువు తీశావంటూ మండిపడుతున్నారు.
ఇవి కూడా చదవండి
మిస్టర్ ట్రంప్.. మాకు రాజులు వద్దు.. అమెరికాలో భారీ నిరసనలు..
యాదగిరీశుడి సేవలో సింధు దంపతులు