History Of OK: ‘ఓకే’.. అసలు చరిత్ర ఇదే
ABN , Publish Date - Apr 18 , 2025 | 11:50 AM
History Of OK: ఓకే అంటే సరే అని అర్ధం. అలాగే ఆమోదం, అంగీకారం అనే అర్ధాలు కూడా ఉన్నాయి. ఈ పదం 19వ శతాబ్ధం నుంచే వాడుకలో ఉంది. ఓకేకు ఒక చరిత్ర ఉంది. అమెరికా రాజకీయ ప్రచారానికి ఓకేతో సంబంధం కూడా ఉంది.

ఏ మాతృభాషలో అయినా కొన్ని ఆంగ్ల పదాలు కలిసిపోతుంటాయి. ఎవరైనా ఎక్కడైనా మాట్లాడేటప్పుడు.. అది తెలుగు, హిందీ ఇలా ఏ భాషలో మాట్లాడినా కూడా అందులో ఇంగ్లీష్ పదాలను కలిపేసి మాట్లాడేస్తుంటారు. మనం మాట్లాడే పదాల్లో చాలా వాటికి అర్ధాలు ఉంటాయి. అసలు ఆ పదాలు ఎప్పుడు, ఎక్కడ నుంచి ఉద్భవించాయో కూడా తెలియదు. వాటిని తెలుసుకుంటే మాత్రం ఆశ్చర్యపడకుండా ఉండలేము. మనం మాట్లాడే పదాలన్నీ కూడా ఏదో ఒక చోట నుంచి వచ్చినవే. వాటినే మనం తరుచుగా వాడుతుంటాం. అందులో ‘ఓకే’ అనే పదం కూడా ఒకటి. ఎవరితో అయినా సంభాషించినప్పుడు.. వారి మాటలతో ఏకీభవానికి వస్తే ‘సరే’ అని అంటూ ఉంటాం. అలాగే ఇతరులకు ఏదైనా సమాచారం పంపించేటప్పుడు కూడా సరే అనే పదాన్ని ఉపయోగిస్తుంటాం. ఇంతకీ ఓకే అనే పదానికి అర్ధం ఏంటో తెలుసా.. అసలు ఆ పదం ఎక్కడి నుంచి వచ్చింది.. ఎలా మన వాడుక భాషలో అలవాటుగా మారిపోయిందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఓకే అంటే సరే అని అర్ధం. అలాగే ఆమోదం, అంగీకారం అనే అర్ధాలు కూడా ఉన్నాయి. ఈ పదం 19వ శతాబ్ధం నుంచే వాడుకలో ఉంది. ఓకేకు ఒక చరిత్ర ఉంది. అమెరికా రాజకీయ ప్రచారానికి ఓకేతో సంబంధం కూడా ఉంది. తొలత ఓకే అంటే అంతా బాగుంది అనే అర్ధం ఉండేదట. ఇప్పుడు సందర్భాన్ని బట్టి అర్ధం మారుతూ వచ్చింది. ఓకే అంటే అవును, సరే, నాకు అర్ధమైంది అని కూడా అర్ధం. ఇంగ్లీష్‌లో ok, oky, okey ఎలా రాసినా కూడా ఒకటే అర్ధంగా భావించవచ్చు.
సరే అనే పదం మొట్టమొదటి 1839లో బోస్టన్ మార్నింగ్ పోస్ట్ పత్రికలో కనిపించింది. ‘ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్’ అనే పదబంధాన్ని ‘ఆల్ కరెక్ట్‌గా’ మార్చారు. 1830లో రచనలను వినోదాత్మకంగా మార్చేందుకు ఇలాంటి కొన్ని పదాలను రచయితలు, పాత్రికేయులు ఉపయోగించేవారు. అందులో భాగంగానే సరే అనే పదం పుట్టుకొచ్చింది. వినోదాత్మకంగా మొదలైన ఈ పదం అతి త్వరలోనే బాగా ప్రాచుర్యం పొందిందనే చెప్పుకోవచ్చు.
ఇక 1840లో అమెరికా ఎన్నికల ప్రచారంలో కూడా ‘ఓకే’ అనే రాజకీయ కథ బాగా పాపులర్ అయ్యింది. డెమోక్రటిక్ అభ్యర్థి మార్టిన్ వాన్ బ్యూరెన్‌కు ‘ఓల్డ్ కిండర్‌హుక్’ అనే మారు పేరు ఉంది. దీంతో అతని మద్దతుదారులు ఆ పేరును కాస్తా ‘సరే’ అనేలాగా షార్ట్ నేమ్ పెట్టేశారు. అంతే కాకుండా ఎన్నికల ప్రచారానికి మద్దతుగా బ్యూరెన్ ‘ఓకే క్లబ్’ను కూడా స్థాపించాడు. ఆ తరువాత సరే అనే పదం చాలా ప్రాచుర్యం పొందింది. ఈ కారణంగా సరే అనే పదాన్ని అమెరికన్ ఇంగ్లీష్‌లో ఒక భాగంగా మారిపోయింది. అమెరికా నుంచి పుట్టిన ఈ పదం ఇతర దేశాల్లో కూడా వ్యాపించగా.. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు దీన్ని త్వరగానే స్వీకరించారు. క్రమ క్రమంగా ‘సరే’ అనే పదం అంగీకారానికి, నిర్ధారణకు చిహ్నంగా మారిపోయింది. ఇప్పుడు మనం మాట్లాడే మాటల్లో ఓకే అనే పదం లేకుండా ఉండదంటే.. ఆ పదం ఎంతటి ప్రాచుర్యం పొందిందో అర్థం చేసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి
Jagan Big Shock: జగన్‌కు భారీ ఎదురు దెబ్బ
Cool Drink Incident: అసలేం తినేటట్టు లేదు.. తాగేట్టూ లేదుగా
Read Latest Pratyekam News And Telugu News