Himachal Brothers: ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకున్న అన్నదమ్ములు
ABN , Publish Date - Jul 20 , 2025 | 09:39 AM
Himachal Brothers: ట్రాన్స్ గిరిలోని బధన గ్రామంలో గత ఆరేళ్లలో ఇలాంటివి ఐదు పెళ్లిళ్లు జరిగాయి. ప్రదీప్, కపిల్‌లు కూడా ఈ ఆచారాన్ని పాటించాలని డిసైడ్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే కున్హత్ గ్రామానికి చెందిన సునీత చౌహాన్‌ను పెళ్లి చేసుకున్నారు.

హిమాచల్ ప్రదేశ్‌లో వింత, విచిత్రమైన సంఘటన ఒకటి చోటుచేసుకుంది. ఓ ఇద్దరు అన్నదమ్ములు ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. సిర్మౌర్ జిల్లాలోని షిల్లాయ్ విలేజ్‌కు చెందిన ప్రదీప్, కపిల్ అన్నదమ్ములు. ప్రదీప్ ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు. కపిల్ వేరే దేశంలో పని చేస్తున్నాడు. వీరు హత్తి అనే గిరిజన తెగకు చెందిన వారు. ఈ తెగలో అన్నదమ్ములు ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకునే ఆచారం ఉంది. రెవెన్యూ చట్టాలు కూడా వీరి ఆచారాన్ని గుర్తించాయి.
దానికి ‘జోడీదర’ అని పేరు పెట్టాయి. ట్రాన్స్ గిరిలోని బధన గ్రామంలో గత ఆరేళ్లలో ఇలాంటివి ఐదు పెళ్లిళ్లు జరిగాయి. ప్రదీప్, కపిల్‌లు కూడా ఈ ఆచారాన్ని పాటించాలని డిసైడ్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే కున్హత్ గ్రామానికి చెందిన సునీత చౌహాన్‌ను పెళ్లి చేసుకున్నారు. హత్తి గిరిజన సాంప్రదాయంలో.. మొత్తం మూడు రోజుల పాటు ఎంతో ఘనంగా ఈ పెళ్లి జరిగింది. జులై 12వ తేదీన పెళ్లి వేడుక మొదలై.. 14వ తేదీన ముగిసింది. జనం పెద్ద ఎత్తున పెళ్లికి వచ్చారు.
ప్రదీప్ మాట్లాడుతూ.. ‘మేము మా ఆచారాన్ని ఫాలో అయ్యాము. ఇందుకు మేము గర్వపడుతున్నాము. ఇది మేమిద్దరం కలిసి తీసుకున్న నిర్ణయం. మేము ఎప్పుడూ పారదర్శకతను నమ్ముతాము’ అని అన్నారు. ఇక, పెళ్లి కూతురు సునీత కూడా అన్నదమ్ముల్ని పెళ్లి చేసుకోవడానికి పెద్దగా ఆలోచించలేదట. ‘నేను ఆ అన్నదమ్ముల మధ్య ఉన్న బంధాన్ని గౌరవిస్తున్నాను. ఎలాంటి ఒత్తిడి లేకుండా ఈ పెళ్లి చేసుకున్నాను’ అని అన్నారు. కాగా, సిర్మౌర్ జిల్లాలోని 450 గ్రామాల్లో మూడు లక్షలకుపైగా హత్తి తెగకు చెందిన వారు ఉన్నారు. ఇప్పటికీ వందల ఏళ్ల నాటి ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు. అన్నదమ్ములు ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి
తల్లి గురించి తప్పుగా మాట్లాడిందని పోలీస్ ప్రియురాలిని..
సోనూసూద్ సాహసం.. ఒంటి చేత్తో పామును పట్టి..