Share News

Hero Vishal: విశాల్‌కు అస్వస్థత.. స్టేజిపై స్ప్రహతప్పిన హీరో

ABN , Publish Date - May 12 , 2025 | 08:37 AM

Hero Vishal Health: ట్రాన్స్‌జెండర్లు తమదైన స్టైల్లో విశాల్‌ను ఆశీర్వదించారు. కలిసి ఫొటోలు కూడా దిగారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఉన్నట్టుండి స్ప్రహ తప్పిపడిపోయారు. ఆయన ఒక్కసారిగా కుప్పకూలటంతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు.

Hero Vishal: విశాల్‌కు అస్వస్థత.. స్టేజిపై స్ప్రహతప్పిన హీరో
Hero Vishal Health

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ గత కొంత కాలం నుంచి తరచుగా అనారోగ్యం బారినపడుతూనే ఉన్నారు. మదగజరాజ సినిమా విడుదల సమయంలో ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. మదగజరాజ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన గజగజ వణుకుతూ కనిపించారు. ఆయన అనారోగ్యం విషయం అప్పట్లో మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ సంచలన సృష్టించింది. చాలా పుకార్లు షికార్లు చేశాయి. ఇప్పుడు మరోసారి విశాల్ అస్వస్థతకు గురయ్యారు. స్టేజిపై స్ప్రహ తప్పిపడిపోయారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


హీరో విశాల్ ఆదివారం తమిళనాడులోని విల్లుపురంలో జరిగిన మిస్ విల్లూపురం ట్రాన్స్‌జెండర్ బ్యూటీ కంటెస్ట్‌కు ముఖ్య అతిధిగా వెళ్లారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి పొన్ముది కూడా వచ్చారు. విశాల్ స్టేజిపై ఉండగా.. కొంత మంది ట్రాన్స్‌జెండర్లు ఎంతో ఆప్యాయంగా ఆయన్ను పలకరించారు. తమదైన స్టైల్లో విశాల్‌ను ఆశీర్వదించారు. కలిసి ఫొటోలు కూడా దిగారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఉన్నట్టుండి అస్వస్థతకు గురయ్యారు. స్టేజిపై స్ప్రహ తప్పిపడిపోయారు. ఆయన ఒక్కసారిగా కుప్పకూలటంతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు.


వెంటనే స్పందించి ఆయన్ని పైకి లేపారు. ఆ వెంటనే చికిత్స నిమిత్తం దగ్గరలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆరోగ్యం ఎలా ఉందన్న దానిపై డాక్టర్లనుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. విశాల్ అస్వస్థతపై ఆయన మేనేజర్ హరి మాట్లాడుతూ.. ‘ భోజనం చేయకపోవటం వల్ల ఆయన అస్వస్థతకు గురైఉండొచ్చు’ అని చెప్పారు. ఇక, విశాల్ అనారోగ్యంపై అభిమానులతో పాటు ఆయన కుటుంబసభ్యులు, మిత్రులు ఆందోళన చెందుతున్నారు. ఆయన అనారోగ్యం ప్రస్తుతం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.


ఇవి కూడా చదవండి

Viral Video: శుభమా అని పెళ్లి చేసుకోబోతూ ఇదేం పని..

Teacher: స్కూలు పిల్లలతో టీచర్ ఎఫైర్.. బహుమతులు ఇచ్చి..

Updated Date - May 12 , 2025 | 08:40 AM