30 Year Old Frozen Embryo: అరుదైన సంఘటన.. 30 ఏళ్లు పిండం.. ఇప్పుడు శిశువు
ABN , Publish Date - Aug 02 , 2025 | 04:57 PM
30 Year Old Frozen Embryo: ఆ నాలుగు పిండాల్లో మూడు పిండాలను మాత్రమే ఆమె ఉపయోగించుకుంది. 1994లో మిగిలిన ఒక్క పిండాన్ని డొనేట్ చేయాలని నిశ్చయించుకుంది. ఇక, అప్పటినుంచి ఆ పిండం లిండా ఆర్కెడ్ కడుపులోనే ఉండిపోయింది.

పై ఫొటోలో కనిపిస్తున్న శిశువు పేరు ‘హాడియస్ డేనియల్ పియర్స్‘. వయసు 30 సంవత్సరాలు. అప్పుడే పుట్టిన శిశువుకు 30 సంవత్సరాల వయసు ఏంటి? అని ఆశ్చర్యపోతున్నారా. ఆ శిశువు పుట్టుక వైద్య శాస్త్రంలోనే ఓ మైలు రాయి. హాడియస్ డేనియల్ పియర్స్ సాధారణమైన శిశువు కాదు. మనలాగా అతడి పుట్టుక కూడా సాధారణమైనది కాదు. అమెరికాకు చెందిన లిండా ఆర్కెడ్ అనే మహిళ 1992లో నాలుగు ఎంబ్రియో(గర్భస్థ పిండం)లను ఫ్రీజ్ చేయించుకుంది. తనకు అవసరం అయినపుడు బిడ్డలను కనాలని అనుకుంది.
అయితే, ఆ నాలుగు పిండాల్లో మూడు పిండాలను మాత్రమే ఆమె ఉపయోగించుకుంది. 1994లో మిగిలిన ఒక్క పిండాన్ని డొనేట్ చేయాలని నిశ్చయించుకుంది. ఇక, అప్పటినుంచి ఆ పిండం లిండా ఆర్కెడ్ కడుపులోనే ఉండిపోయింది. దాదాపు 25 ఏళ్ల తర్వాత లిండ్సే, టిమ్ పియర్సేల జంట ఆ పిండాన్ని వాడుకుంది. ఈ జంటకు సాధారణంగా బిడ్డను కనటంలో ఇబ్బంది మొదలైంది. ఈ నేపథ్యంలోనే లిండా ఆర్కెడ్ కడుపులో ఉన్న పిండాన్ని ఎంతో జాగ్రత్తగా లిండ్సే కడుపులోకి మార్చారు.
2023లో ఈ ప్రక్రియ జరిగింది. హాడియస్ డేనియల్ పియర్స్.. లిండ్సే కడుపులో పెరిగాడు. కొన్ని నెలల తర్వాత ఈ భూమ్మీదకు వచ్చాడు. సాధారణంగా జన్మించిన పిల్లల్లానే ఇతడు కూడా ఎంతో ఆరోగ్యంగా ఉన్నాడు. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ వయసు కలిగిన శిశువుగా రికార్డు సృష్టించాడు. హాడియస్ డేనియల్ పియర్స్ జననంపై ఇండోర్‌కు చెందిన డాక్టర్ జ్యోతి మాట్లాడుతూ..‘30 ఏళ్ల క్రితం ఫ్రీజ్ చేసిన పిండం కూడా ఎంతో ఆరోగ్యమైన శిశువు అవ్వగలదు. క్రైపో ప్రిజర్వేషన్, విట్రిఫికేషన్‌కు కృతజ్ణతలు చెప్పాలి. అల్ట్రా లో టెంపరేచర్ వద్ద సెల్యూలర్ యాక్టివిటీ నిలిచిపోతుంది. తద్వారా పిండం పాడవ్వటం లేదా వయసు పెరగటం వంటివి జరగవు’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి
సోదరులతో కలిసి భర్త హత్యకు ప్లాన్.. ఈ ట్విస్ట్ అస్సలు ఊహించలేదు..
మానవత్వం మరిచిన పోలీస్.. మరీ ఇంత దారుణమా..