Sonakshi Sinha: హీరోయిన్ ఇంట్లో దెయ్యం.. ఏం చేయొద్దని బతిమాలిందట..
ABN , Publish Date - Jun 22 , 2025 | 06:24 PM
Sonakshi Sinha: సోనాక్షి నటించిన తాజా చిత్రం ‘నికిత రాయ్’ విడుదలకు సిద్ధంగా ఉంది. హర్రర్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఆ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఆమె.. దెయ్యంతో తనకు ఎదురైన అనుభవంపై స్పందించారు.

ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హాకు దెయ్యంతో ఓ భయానక అనుభవం ఎదురయ్యిందట. అది కూడా ఆమె సొంత ఇంట్లో దెయ్యం ఆమెను భయపెట్టిందట. ఈ విషయాన్ని స్వయంగా ఆమే మీడియాకు వెల్లడించారు. సోనాక్షి నటించిన తాజా చిత్రం ‘నికిత రాయ్’ విడుదలకు సిద్ధంగా ఉంది. హర్రర్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఆ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఆమె.. దెయ్యంతో తనకు ఎదురైన అనుభవంపై స్పందించారు. సోనాక్షి మాట్లాడుతూ.. ‘నేను దెయ్యాలంటే నమ్మేదాన్ని కాదు. అదంతా ఫేక్ అనుకునేదాన్ని.
కానీ, ఆ రోజు జరిగిన సంఘటనతో అంతా మారిపోయింది. నేను మా ఇంట్లో నిద్రపోతూ ఉన్నాను. తెల్లవారుజామున 4 గంటల సమయంలో మెలుకువ వచ్చినట్లు అనిపించింది. ఎవరో నన్ను లేపుతున్నట్లు అనిపించింది. నా శరీరం మీద ఏదో ఒత్తిడి. ఎవరో నా మీద కూర్చున్నట్లు అనిపించింది. నేను భయంతో కళ్లు తెరవలేదు. కదలలేకుండా ఉన్నాను. ఉదయం వరకు అలానే ఉండిపోయాను. వెలుతురు నా మీద పడ్డ తర్వాత నాలో కదలిక వచ్చింది.
ఈ సంఘటనతో దెయ్యాలు ఉన్నాయనిపించింది. కానీ, ఆ దెయ్యం నన్ను ఏమీ చేయలేదు. అది హాని చెయ్యని దెయ్యం అనిపించింది. నాకు ధైర్యం వచ్చింది. దెయ్యంతో మాట్లాడాలని అనుకున్నాను. రాత్రి అవ్వగానే ‘నువ్వు నిన్న రాత్రి వచ్చావు. ఈ రోజు నన్ను ఇబ్బంది పెట్టకు’ అని ప్రార్థించాను. ఆశ్చర్యకరంగా ఆ దెయ్యం మళ్లీ రాలేదు. బహుశా ఆ దెయ్యం నా మాటలు వింది’ అని అంది. దెయ్యం అనుభవంపై సోనాక్షి చేసిన కామెంట్లు చర్చకు దారి తీశాయి. సినిమా ప్రమోషన్ల కోసం అబద్ధం చెబుతోందని కొంతమంది అంటున్నారు.
ఇవి కూడా చదవండి
మామూలోడు కాదు.. జాకెట్‌లో మందు సీసాలు దాచి..
ఇరాన్‌పై అమెరికా దాడి.. తీవ్రంగా ఖండించిన పాక్..