Share News

TikToker Noel Robinson: నోయల్‌కు ఇండియాలో చేదు అనుభవం.. లాక్కెళ్లిన పోలీసులు..

ABN , Publish Date - Jul 31 , 2025 | 04:57 PM

TikToker Noel Robinson: నోయల్ ఇండియాకు వచ్చాడు. బెంగళూరులో పర్యటించాడు. సాంప్రదాయ దుస్తులు ధరించి రోడ్డుపైకి వచ్చాడు. వీధుల్లో తిరుగుతూ డ్యాన్సులు చేశాడు. పర్మీషన్ లేకుండా పబ్లిక్‌లో డ్యాన్స్ చేసినందుకు బెంగళూరు పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు.

TikToker Noel Robinson: నోయల్‌కు ఇండియాలో చేదు అనుభవం.. లాక్కెళ్లిన పోలీసులు..
TikToker Noel Robinson

సోషల్ మీడియాలో బాగా యాక్టీవ్‌గా ఉండే వాళ్లకు జర్మన్ టిక్‌టాకర్ నోయల్ రాబిన్‌సన్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. పేరు తెలియని వాళ్లు కూడా అతడి జుట్టు చూస్తే ఇట్టే గుర్తుపట్టేస్తారు. నోయల్ ‘బేబీ కామ్ డౌన్’ పాటకు డ్యాన్స్ చేస్తూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. నోయల్ దేశ దేశాలు తిరుగుతూ పబ్లిక్‌లో డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. దొంగతనం చేస్తున్నట్లు బిల్డప్ ఇచ్చి.. జనాల్ని అదరగొడతాడు. ఆ వెంటనే బేబీ కామ్ డౌన్ అని డ్యాన్స్ చేస్తాడు. ఇతడి వీడియోలు కేవలం టిక్‌టాక్‌లోనే కాదు.. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లలో కూడా చాలా ఫేమస్.


నోయల్‌ను యూట్యూబ్‌లో 19 మిలియన్ల మంది.. ఇన్‌స్టాగ్రామ్‌లో 12 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇంత ఫాలోయింగ్ ఉన్న ఇతడు తాజాగా ఇండియాకు వచ్చాడు. బెంగళూరులో పర్యటించాడు. సంప్రదాయ దుస్తులు ధరించి రోడ్డుపైకి వచ్చాడు. వీధుల్లో తిరుగుతూ డ్యాన్సులు చేశాడు. పర్మీషన్ లేకుండా పబ్లిక్‌లో డ్యాన్స్ చేసినందుకు బెంగళూరు పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. స్టేషన్‌కు తీసుకెళ్లారు. కొన్ని గంటల తర్వాత వదిలేశారు. నోయల్ ఇందుకు సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశాడు.


‘నన్ను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లటం ఇదే మొదటి సారి. వాళ్లు నన్ను జైలుకు పంపిస్తారేమోనని భయపడ్డా. కానీ, అంతా మంచిగానే నడిచింది. నేను ఇప్పుడు బాగానే ఉన్నా. ఐ లవ్ ఇండియా’ అని పేర్కొన్నాడు. ఆ వీడియో వైరల్‌గా మారింది. వైరల్‌గా మారిన వీడియోపై స్పందించిన ఓ నెటిజన్.. ‘విదేశీయుడు ఇండియాను ఎక్స్‌ప్లోర్ చేయాలని వచ్చిన ప్రతిసారీ దేశ ప్రతిష్టను కర్ణాటక పాడు చేస్తోంది’ అని కామెంట్ పెట్టాడు. ఈ కామెంట్‌పై నోయల్ స్పందిస్తూ.. ‘మీరు క్షమాపణ కోరాల్సిన అవసరం లేదు. ప్రతీ దేశంలో ఇలానే జరుగుతుంటుంది. కేవలం ఇండియాలో మాత్రమే కాదు. ఓ చిన్న అనుభవం కారణంగా ఇండియాపై నాకున్న ప్రేమ చావదు’ అని హుందాగా బదులిచ్చాడు.


ఇవి కూడా చదవండి

తల్లికి చివరి మెసేజ్.. అమ్మా నన్ను వీళ్లే చంపేస్తారు..

ఏడేళ్లలో 42 సార్లు రిజెక్ట్ చేసింది.. 43వ సారి మాత్రం..

Updated Date - Jul 31 , 2025 | 08:23 PM