Fahadh Faasil Keypad Phone: ఇప్పటికీ కీప్యాడ్ ఫోన్ వాడుతున్న ఫాఫా.. ధర ఎంతంటే..
ABN , Publish Date - Jul 17 , 2025 | 07:04 AM
Fahadh Faasil Keypad Phone: స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్ వాడే ఫోన్ ట్రెండింగ్ టాపిక్‌గా మారింది. దాని ధర తెలిసి జనం షాక్ అవుతున్నారు. కీప్యాడ్ ఫోన్ అంత ధరా?.. అని నోరెళ్ల బెడుతున్నారు.

మలయాళ స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. డబ్బింగ్ సినిమాలతో పాటు.. పుష్ప సినిమాలో విలన్‌గా తెలుగునాట మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మలయాళ ప్రేక్షకులు ఆయన్ని ముద్దుగా ఫాఫా అని పిలుస్తుంటారు. ఫాఫా కొత్త కొత్త కథలతో, ఇప్పటి వరకు తాను చేయని పాత్రలతో ప్రేక్షకులను పలకరిస్తూ ఉంటారు. ఒకరకంగా చెప్పాలంటే నటన అంటే ఫాఫా.. ఫాఫా అంటే నటన అనేంతగా దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు.
ఇక, ఫాఫా వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే ఆయన సింపుల్ బట్ కాస్ట్‌లీ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఆయన వాడే ఫోన్ ట్రెండింగ్ టాపిక్‌గా మారింది. దాని ధర తెలిసి జనం షాక్ అవుతున్నారు. కీప్యాడ్ ఫోన్ అంత ధరా?.. అని నోరెళ్ల బెడుతున్నారు. ఫాఫా యూకేకు చెందిన లగ్జరీ బ్రాండ్ వెర్తూ కీప్యాడ్ ఫోన్ వాడుతున్నారు. పాత కీప్యాడ్ మోడల్ అయినప్పటికి వెర్తూ కంపెనీ ధరలు భారీగా ఉంటాయి. ఫాఫా వాడుతున్న కీప్యాడ్ ఫోన్ ధర దాదాపు 12 వేల డాలర్లు.. అదే ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే.. 10 లక్షల రూపాయలు పైనే.
వెర్తూ వెబ్ సైట్ ప్రకారం.. ఫాఫా వాడుతున్న ఫోన్ స్టాక్ లేదు. ఆయన కొన్ని నెలల ముందు లేదా కొన్ని సంవత్సరాల ముందు దాన్ని కొని ఉండవచ్చు. ఫాఫా స్మార్ట్ ఫోన్ వాడరు. సోషల్ మీడియాకు దూరంగా ఉంటారు. అందుకే బేసిక్ కీప్యాడ్ ఫోన్ వాడుతున్నారు. ఇక, ఫాఫా సినిమా విషయాలకు వస్తే.. ఆయన నటించిన మారీశన్, ఓడుమ్ కుదుర చాడుమ్ కుదర, డోంట్ ట్రబుల్ ది ట్రబుల్, పాట్రియాట్ అండ్ కరాటే చంద్రన్ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
ఇవి కూడా చదవండి
మొక్కల మాటలు కీటకాలకు అర్థమవుతాయ్
నిమిషప్రియకు క్షమాభిక్ష ప్రసక్తే లేదు..