అక్కడ ఉండే ప్రతీ బిచ్చగాడి దగ్గర ఆ నటుడి ఫోన్ నెంబర్
ABN , Publish Date - Apr 22 , 2025 | 05:40 PM
Jackie Shroff Phone Number: ఆ నటుడు చాలా పేదరికంలో పుట్టి పెరిగారు. అందుకే పేదల కష్టాలు ఆయనకు తెలుసు. ముంబైలోని 100 కుటుంబాలను దత్తత తీసుకుని వారి అవసరాలను తీరుస్తున్నారు. పాలి హిల్ ఏరియాలోని ప్రతీ బిచ్చగాడికి తన నెంబర్ ఇచ్చారు.

కొంచెం డబ్బు సంపాదించగానే నూటికి 90 శాతం మందికి పొగరు తలకు ఎక్కుతుంది. తమకు సాయం చేసిన వాళ్లను కూడా మర్చిపోతారు. ఎదుటి మనిషికి మర్యాద ఇవ్వటం కూడా మానేస్తారు. ఎవరికైనా సాయం చేయాల్సిన పరిస్థితి వస్తే.. చేతులు ఎత్తేస్తారు. కానీ, మిగిలిన 10 శాతం మంది ఎంత డబ్బు సంపాదించినా.. ఎంత ఫేమ్ సంపాదించినా ఒదిగే ఉంటారు. తోటి మనుషులకు సాయం చేయడానికి ఎప్పుడూ ముందుంటారు. అలాంటి వారిలో బాలీవుడ్ స్టార్ నటుడు జాకీ శ్రాఫ్ కూడా ఒకరు. ఆయన తను సంపాదించే దాంట్లో పెద్ద మొత్తం పేదల కోసం ఖర్చు చేస్తున్నారు.
నిరుపేద కుటుంబం నుంచి వచ్చి..
జాకీ శ్రాఫ్ నిరుపేద కుటుంబం నుంచి వచ్చారు. ఓ చిన్న రూములో కుటుంబం మొత్తం నివసించేది. రాత్రిళ్లు పడుకున్నపుడు ఎలుకలు అటు ఇటు.. మీద నుంచి పరుగులు తీస్తూ ఉండేవి. కొన్ని సార్లు చేతి వేళ్లను కూడా కొరుకుతూ ఉండేవి. ఆర్థిక పరిస్థితి కూడా సరిగా ఉండేది కాదు. అందుకే 11వ తరగతి తర్వాత చదువు మానేశారు. సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఆయన జీవితమే మారిపోయింది. దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పేరుతో పాటు విపరీతంగా డబ్బు కూడా సంపాదించారు. ఎంత ఎదిగినా ఆయన మాత్రం తన మూలాల్ని మర్చిపోలేదు.
ప్రతీ బిచ్చగాడి దగ్గర జాకీ ఫోన్ నెంబర్
జాకీ శ్రాఫ్ పుట్టి పెరిగిందంతా ముంబై, టీన్‌బట్టి వాకేశ్వర్ ఏరియాలో. అందుకే ముంబై స్లమ్‌లోని 100 కుటుంబాలను దత్తత తీసుకుని వారి అవసరాలను తీరుస్తున్నారు. పాలి హిల్ ఏరియాలోని ప్రతీ బిచ్చగాడికి తన నెంబర్ ఇచ్చారు. ‘ మీకు రాత్రిళ్లు ఆకలిగా ఉంటే నాకు ఫోన్ చేయండి. నేను మీకు ఆహారం పంపుతాను. రోజులో ఎప్పుడైనా.. ఏ సమయంలోనైనా నా సాయం కావాలనుకుంటే నాకు వెంటనే ఫోన్ చేయండి. సాయం చేస్తాను’ అని చెప్పారు. జాకీ అప్పుడప్పుడు తను దత్తత తీసుకున్న కుటుంబాలను కలుస్తూ ఉంటారు. వారి బాగోగులు తెలుసుకుంటూ ఉంటారు.
ఇవి కూడా చదవండి
Gold: పిల్లాడి కడుపులో 100 గ్రాముల బంగారం
Relationship Tips: బ్రేకప్ తర్వాత అమ్మాయిలు ఏం చేస్తారో తెలిస్తే షాక్ అవుతారు..