Dog Babu Story: ఓటర్ కార్డు కోసం అప్లై చేసుకున్న డాగ్ బాబు.. తర్వాత ఏం జరిగిందంటే..
ABN , Publish Date - Jul 28 , 2025 | 06:16 PM
Dog Babu Story: ఆ కుక్క పేరు .. డాగ్ బాబు. తండ్రి పేరు.. కుత్తా బాబు. తల్లి పేరు.. కుతియా దేవి. డాగ్ బాబు మసౌర్హి పోస్ట్ ఆఫీస్ దగ్గర నివాసం ఉంటున్నాడు. ఆ డాగ్ బాబు ఓటర్ కార్డు కోసం అప్లై చేసుకున్నాడు.

బీహార్ రాష్ట్రంలో ఎన్నికల హడావుడి నడుస్తోంది. మరి కొన్ని నెలల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఓటర్ రివ్యూ ప్రాసెస్ శరావేగంగా జరుగుతోంది. ఓటర్ రివ్యూ ప్రాసెస్‌లో భాగంగా ఎన్నికల అధికారులకు వింత, విచిత్రమైన అనుభవాలు ఎదురవుతున్నాయి. ఓ కుక్క ఓటర్ కార్డు కోసం అప్లై చేసుకుంది. రెసిడెన్స్ సర్టిఫికేట్‌తో సహా అప్లికేషన్ రావటంతో అధికారులు షాక్ అయ్యారు. అప్లికేషన్‌ను రిజెక్ట్ చేయటంతో పాటు రెవెన్యూ అధికారులను కూడా అప్రమత్తం చేశారు. దీంతో కుక్క రెసిడెన్స్ సర్టిఫికేట్ క్యాన్సల్ అయింది.
అప్పటికే ఆ కుక్క రెసిడెన్స్ సర్టిఫికేట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఆ సర్టిఫికేట్‌లో ఏముందంటే.. ఆ కుక్క పేరు .. డాగ్ బాబు. తండ్రి పేరు.. కుత్తా బాబు. తల్లి పేరు.. కుతియా దేవి. డాగ్ బాబు మసౌర్హి పోస్ట్ ఆఫీస్ దగ్గర నివాసం ఉంటున్నాడు. ఇక, కుక్కకు రెసిడెన్స్ సర్టిఫికేట్ జారీ చేయటంపై దర్యాప్తు మొదలైంది. గుర్తు తెలియని వ్యక్తి కుక్క పేరుతో ‘రైట్ టు పబ్లిక్ సర్వీస్’ పోర్టల్ ద్వారా ఈ సర్టిఫికేట్ తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. కుక్క సర్టిఫికేట్ కోసం ఇచ్చిన డాక్యుమెంట్లు ఢిల్లీకి చెందిన ఓ మహిళవిగా తేల్చారు.
ఆమె ఆధార్‌తో పాటు ఇతర సర్టిఫికేట్లు పోర్టల్‌లో అప్‌లోడ్ చేసి సర్టిఫికేట్ తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. పాట్నా డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ త్యాగరాజన్ మాట్లాడుతూ.. ‘ఇది చాలా సీరియస్ మ్యాటర్. కొన్ని రహస్య శక్తులు ఈ పని చేశాయి. జులై 24వ తేదీన మధ్యాహ్నం 3.56 గంటలకు సర్టిఫికేట్ జారీ అయింది. 3.58 గంటలకు క్యాన్సిల్ కూడా అయింది. ఈ సర్టిఫికేట్ జారీ అవ్వడానికి కారణం అయిన వారిపై కేసు నమోదు అయింది. వారిపై చర్యలు కూడా తీసుకున్నాము. విధుల నుంచి సస్పెండ్ చేశాము. దీని వెనకాల ఉన్న వారిపై కూడా చర్యలు తీసుకుంటాము’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి
70 ఏళ్ల బామ్మ సాహసం.. పామును మెడకు చుట్టుకుని..
డాక్టర్ల నిర్లక్ష్యం.. పేషంట్ ప్రాణం పోతుందని తెలిసినా..