Renuka Swami Case: మర్డర్ కేసు.. ప్రత్యక్ష సాక్షితో కలిసి సినిమా చూసిన దర్శన్
ABN , Publish Date - Apr 10 , 2025 | 02:00 PM
Darshan Renuka Swami Case: రేణుక స్వామి మర్డర్ కేసులో జైలు పాలైన దర్శన్ బెయిల్‌పై బయటకు వచ్చారు. కొద్దిరోజుల క్రితం ఆయన కోర్టుకు వెళ్లాల్సి ఉండింది. తనకు వెన్నులో నొప్పి ఉందని చెప్పి వెళ్లలేదు. తాజాగా, వామన అనే సినిమాకు వెళ్లారు.

ప్రముఖ కన్నడ స్టార్ హీరో దర్శన్ రేణుక స్వామి మర్డర్ కేసులో ఇరుక్కోవటం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఆయన ఏ2గా ఉన్నారు. కొన్ని నెలల పాటు జైలులో ఉన్న ఆయన ఇది వరకే బెయిల్‌పై విడుదల అయ్యారు. బెయిల్‌పై ఉన్న ఆయన ఓ వివాదంలో చిక్కుకున్నారన్న టాక్ కన్నడనాట బాగా వినిపిస్తోంది. రేణుక స్వామి మర్డర్ కేసులో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న ఓ వ్యక్తితో కలిసి దర్శన్ సినిమా చూశారంట. దర్శన్‌కు అత్యంత సన్నిహితుడైన చిక్కన్న వామన అనే సినిమా చేశాడు. ఈ సినిమా తాజాగా విడుదలైంది. ఈ సినిమాకు దర్శన్ వెళ్లారు. అక్కడ దర్శన్‌తో పాటు ప్రత్యక్ష సాక్షి కూడా ఉన్నట్లు సమాచారం. అతడితో కలిసి దర్శన్ సినిమా చూశారన్న ప్రచారం జరుగుతోంది.
ఇదే గనుక నిజం అయితే.. దర్శన్ చిక్కుల్లో పడే అవకాశం ఉంది. పోలీసులు ఈ పాయింట్ మీద కోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. కోర్టు రూల్స్ ప్రకారం.. నిందితులు.. సాక్షులతో కాంటాక్ట్‌లో ఉండకూడదు. సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంటుందన్న కారణంతో కోర్టులు ఈ నిబంధనను కఠినంగా ఫాలో అవుతాయి. నిబంధనను అతిక్రమిస్తే బెయిల్ రద్దు చేస్తాయి. మరి, దర్శన్ విషయంలో ఏం జరుగుతుందో వేచి చూడాలి. అసలు ఆయన నిజంగానే సాక్షితో కలిసి సినిమా చూశారా? లేదా? అన్నది కూడా తేలాలి. అది నిజం అని తేలితే పోలీసులు రంగంలోకి దిగే అవకాశం ఉంది. కాగా, దర్శన్ కొద్దిరోజుల క్రితం కోర్టులో హాజరుకావాల్సి ఉండింది. అయితే.. తనకు వెన్నులో నొప్పిగా ఉందని చెప్పి కోర్టుకు వెళ్లలేదు.
రికార్డుల హీరో.. ప్రియురాలి కోసం జైలుకు..
దర్శన్ ఆశామాషీ హీరో కాదు. కన్నడ నాట టాప్ 1లో ఉన్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అక్కడ ప్యాన్ ఇండియా సినిమాలు సైతం సాధించలేని రికార్డులను ఎన్నో సాధించాడు. ఆయన చివరగా నటించిన కాటేర సినిమా కూడా రికార్డు సృష్టించింది. కేవలం కన్నడ నాట మాత్రమే 100 కోట్లకుపైగా కలెక్షన్లు కొల్లగొట్టింది. అలాంటి హీరో భార్య ఉండగానే.. పవిత్ర అనే హీరోయిన్‌తో ప్రేమలో పడ్డాడు. కొన్నేళ్లుగా ఆమెతో సహజీవనం చేస్తున్నాడు. దర్శన్ ఫ్యాన్ అయిన రేణుక స్వామికి ఇది నచ్చలేదు. పవిత్రను టార్గెట్ చేశాడు. సోషల్ మీడియాలో దారుణంగా వేధించాడు. ఈ విషయాన్ని పవిత్ర, దర్శన్‌కు చెప్పింది. రేణుక స్వామిని పిలిపించి.. కొట్టి చంపేశాడు. టాప్ హీరో అలా జైలు పాలయ్యాడు.
ఇవి కూడా చదవండి
Tamil Nadu: ఇంకెన్నాళ్లీ అరాచకం.. స్కూల్లోనే ఇంత దారుణమా
Viral Video: పాపం.. పిల్లిని కాపాడ్డం కోసం ప్రాణాలు పోగొట్టుకున్నాడు