CID 2: సార్ మా అమ్మ మర్డర్ కేసు ఛేదించండి.. సీఐడీ నటుడికి ఫ్యాన్ విజ్ఞప్తి..
ABN , Publish Date - Jun 19 , 2025 | 07:42 PM
CID 2 Parth Samthaan: సీఐడీ సీజన్ 2లో కొత్త పాత్రలు కూడా ఎంటర్ అయ్యాయి. నటుడు పార్థ్ సమ్‌తాన్.. ఏసీపీ ఆయుష్మాన్‌గా ఎంట్రీ ఇచ్చాడు. తన యాక్టింగ్‌తో అదరగొట్టాడు.

సీఐడీ సీరియల్‌కు దేశ వ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నైంటీస్ కిడ్స్‌కు ఇష్టమైన క్రైమ్ సీరియల్స్‌లో సీఐడీ టాప్‌లో ఉంటుంది. హిందీ భాషలో తీసిన ఈ సీరియల్‌ను తెలుగు, తమిళం, కన్నడతో పాటు ఇతర భాషల్లోనూ డబ్ చేశారు. ప్రసారం అయిన అన్ని భాషల్లో సీరియల్ సూపర్ హిట్ అయింది. ఆ సీరియల్‌లో నటించిన వారందరికీ దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం సీఐడీ సీజన్ 2 నడుస్తోంది. సీజన్ 2 కూడా మంచి రేటింగ్స్‌తో దూసుకుతోంది.
సీజన్ 2లో కొత్త పాత్రలు కూడా ఎంటర్ అయ్యాయి. నటుడు పార్థ్ సమ్‌తాన్.. ఏసీపీ ఆయుష్మాన్‌గా ఎంట్రీ ఇచ్చాడు. తన యాక్టింగ్‌తో అదరగొట్టాడు. అయితే, సీఐడీ సీజన్2లో అతడి పాత్ర ముగిసింది. గత కొన్ని ఎపిసోడ్ల నుంచి పార్థ్ కనిపించటం లేదు. తాజాగా, అతడు భారతీ సింగ్ పోడ్ క్యాస్ట్‌లో పాల్గొన్నాడు. తనకు ఎదురైన ఓ వింత అనుభవాన్ని షేర్ చేసుకున్నాడు. సీరియల్‌పై జనాలకు ఉన్న నమ్మకాన్ని బయటపెట్టాడు. ఆ పోడ్ క్యాస్ట్‌లో పార్థ్ మాట్లాడుతూ.. ‘చాలా మంది ఈ సీరియల్‌ను సీరియస్‌గా తీసుకుంటారు.
నాకు ఓ సారి అభిమాని నుంచి ఓ మెసేజ్ వచ్చింది. అది చదివి నేను షాక్ అయిపోయాను. ‘మా అమ్మ మర్డర్ కేసును మీరే సాల్వ్ చేయగలరని నాకు అనిపిస్తోంది. దయచేసి మీరు మీ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి. మీరే నా చివరి నమ్మకం’ అని మెసేజ్ చేశాడు. ఇలాంటి వ్యక్తులు కూడా ఉంటారు. ఇంకా కొంత మంది ఎలా ఉంటారంటే.. నాతో పాటు పని చేసే అమ్మాయిల ఫోన్ నెంబర్లు అడుగుతూ ఉంటారు. నాకు కామెడీగా అనిపిస్తూ ఉంటుంది’ అని అన్నాడు.
ఇవి కూడా చదవండి
విమాన ప్రమాదం.. కస్టమర్లకు ఎయిర్ ఇండియా సీఈఓ లేఖ..
డీజే విషయంలో గొడవ.. పోలీసులను చావగొట్టిన జనం