Share News

Hanuman Garhi: 300 ఏళ్ల ఆచారానికి బ్రేక్.. రాముడి దగ్గరకు హనుమాన్ భక్తుడు

ABN , Publish Date - Apr 28 , 2025 | 04:00 PM

Hanuman Garhi Temple: మూడు వందల ఏళ్ల ఆచారాన్ని బ్రేక్ చేయాలని భావిస్తున్నారు. అది కూడా రాముడి కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ హనుమంతుడి గుడికి అతి దగ్గరలో అయోధ్య రామ మందిరం ఉంది. ప్రేమ దాస్ రామ మందిరానికి వెళ్లాలనుకుంటున్నారు. ప్రేమ్ దాస్ ఈ నిర్ణయం తీసుకోవటం వెనుక ఓ బలమైన కారణం ఉందట.

Hanuman Garhi: 300 ఏళ్ల ఆచారానికి బ్రేక్.. రాముడి దగ్గరకు హనుమాన్ భక్తుడు
Hanuman Garhi Temple

రాముడి కోసం ఓ హనుమాన్ భక్తుడు చరిత్రను సవాల్ చేసే నిర్ణయం తీసుకున్నాడు. రాముడి దర్శనం కోసం ఏకంగా 300 ఏళ్ల పురాతన ఆచారాన్ని బ్రేక్ చేయడానికి సిద్దమయ్యాడు. ఉత్తర ప్రదేశ్లోని పరమ పవిత్ర పుణ్యక్షేత్రం అయోధ్య దగ్గర ‘ హానుమాన్ గర్హి’ అనే హనుమంతుడి దేవాలయం ఉంది. ఈ దేవాలయాన్ని 18వ శాతాబ్ధంలో నిర్మించారు. ఈ ఆలయం నిర్మించిన నాటి నుంచి ఇప్పటి వరకు ఓ ఆచారం కొనసాగుతూ వస్తోంది. హనుమాన్ గర్హి ఆలయ ప్రధాన పూజారిని ‘ గద్దీ నషీన్’ అంటారు. ఈ గద్దీ నషీన్‌లు చాలా కఠినమైన రూల్స్ ఫాలో కావాల్సి ఉంటుంది. వీరు గుడిని దాటి బయటకు వెళ్లకూడదు.


ఆఖరికి అది కోర్టు వ్యవహారం అయినా సరే.. వాళ్లు గుడిని దాటి బయటకు వెళ్లడానికి వీలు లేదు. ప్రస్తుతం మహంత్ ప్రేమ్ దాస్ అనే 70 ఏళ్ల వ్యక్తి హనుమాన్ గర్హి ప్రధాన పూజారిగా ఉన్నాడు. దాదాపు 50 ఏళ్లపైనుంచి ఆయన గుడిని దాటి బయటకు ఎప్పుడూ బయటకు రాలేదు. అలాంటి ఆయన తొలిసారి బయటకు రావాలని చూస్తున్నారు. మూడు వందల ఏళ్ల ఆచారాన్ని బ్రేక్ చేయాలని భావిస్తున్నారు. అది కూడా రాముడి కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ హనుమంతుడి గుడికి అతి దగ్గరలో అయోధ్య రామ మందిరం ఉంది. ప్రేమ దాస్ రామ మందిరానికి వెళ్లాలనుకుంటున్నారు.


ఏప్రిల్ 30వ తేదీన ఆయన రామ మందిరానికి వెళ్లనున్నారు. అది కూడా అక్షయ తృతీయ నాడు హనుమంతుడి భక్తుడు .. రామ మందిరానికి వెళ్లనున్నాడు. హనుమాన్ గర్హి ఆచారం గురించి తెలిసిన వాళ్లు ఎంతో ఆసక్తిగా ఈ అపురూప గట్టం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రేమ్ దాస్ ఈ నిర్ణయం తీసుకోవటం వెనుక ఓ బలమైన కారణం ఉందట. ఆయన శిష్యులు చెబుతున్న దాని ప్రకారం.. హనుమంతుడు ప్రతీ నిత్యం ప్రేమ్ చంద్ కలలో కనిపిస్తూ ఉన్నారు. రామ మందిరాన్ని సందర్శించమని చెబుతూ ఉన్నారు. ఇదే విషయాన్ని ఆయన ఆలయ కమిటీకి చెప్పాడు. వారు ఏకగ్రీవంగా దీన్ని అంగీకరించారు. 300 ఏళ్ల ఆచారాన్ని పక్కన పెట్టి రామ మందిరానికి వెళ్లడానికి అనుమతించారు.


ఇవి కూడా చదవండి

Live In Partner: పదేళ్ల సహజీవనం.. బెడ్డు కింద ప్రియురాలి శవం..

అడిగినంత పనీర్ వేయలేదని పెళ్లి మండపంలో దారుణం..

Updated Date - Apr 28 , 2025 | 04:01 PM