Vijay Devarakonda: ‘రెట్రో’ ప్రీరిలీజ్ ఈవెంట్ ఎఫెక్ట్.. హీరో విజయ్ దేవరకొండపై కేసు
ABN , Publish Date - May 01 , 2025 | 08:41 PM
Hero Vijay Devarakonda: కొద్దిరోజుల క్రితం హీరో సూర్య నటించిన ‘రెట్రో’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టేజిపై విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. పలు విషయాలను ప్రస్తావించారు.

ఓ సినిమా ఫంక్షన్‌లో హీరో విజయ్ దేవరకొండ చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. ఓ వర్గాన్ని ఆయన కించపరిచేలా మాట్లాడారంటూ ఓ లాయర్ పోలీసులను ఆశ్రయించాడు. విజయ్ దేవరకొండపై ఫిర్యాదు చేశాడు. ఇంతకీ సంగతేంటంటే.. కొద్దిరోజుల క్రితం హీరో సూర్య నటించిన ‘రెట్రో’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టేజిపై మాట్లాడుతూ.. పలు విషయాలను ప్రస్తావించారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఆదివాసీయులను అవమానించారంటూ లాయర్ కిషన్ లాల్ చౌహాన్ పోలీసులను ఆశ్రయించాడు. విజయ్‌పై ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఎస్‌ఆర్ నగర్ పోలీసులు కంప్లైంట్‌ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
కింగ్‌డమ్ మీదే ఆశలన్నీ..
విజయ్ దేవరకొండ గత కొన్నేళ్ల నుంచి వెనుకబడిపోయాడు. వరసగా సినిమాలు ఫెయిల్ అవుతూ వస్తున్నాయి. 2022లో వచ్చిన లైగర్, 2023లో వచ్చిన ఖుషీ, 2024లో వచ్చిన ది ఫ్యామిలీ స్టార్ ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఈ నేపథ్యంలోనే ఆశలన్నీ ‘ కింగ్‌డమ్’ మీద పెట్టుకున్నాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాలో విజయ్ సరసన భాగ్య శ్రీ బోర్సే నటించింది. 110 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
ఇవి కూడా చదవండి
Youtube India: ఇట్స్ అమేజింగ్.. యూట్యూబ్ నుంచి వేల కోట్లు సంపాదిస్తున్న ఇండియన్స్..
Viral Video: పెళ్లికి ముందు అనుకోని సంఘటన.. మండపంగా మారిన ఆస్పత్రి..