Share News

Actress Chhaya Kadam: చిక్కుల్లో ప్రముఖ నటి.. వైల్డ్ లైఫ్ కేసు..

ABN , Publish Date - May 01 , 2025 | 04:12 PM

Actress Chhaya Kadam: వైల్డ్ లైఫ్ చట్టాల కింద నటి ఛాయా కదమ్‌పై కేసు నమోదు అయింది. అటవీ శాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు అధికారులు ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యలు నిజామా.. కాదా.. అన్న దానిపై విచారణ మొదలుపెట్టారు

Actress Chhaya Kadam: చిక్కుల్లో ప్రముఖ నటి.. వైల్డ్ లైఫ్ కేసు..
Actress Chhaya Kadam

బాలీవుడ్ దర్శక, నిర్మాత కిరణ్ రావు దర్శకత్వం వహించిన ‘ లా పతా లేడీస్’ సినిమాతో ‘ ఛాయా కదమ్’ దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమాలో ఆమె నటనకు గాను ప్రముఖులనుంచి ప్రశంసలు సైతం అందుకుంది. ఒక్క సినిమాతో ఛాయా కదమ్ సినిమా కెరీర్ మారిపోయింది. ప్రస్తుతం మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఆమెపై ఓ కేసు నమోదైంది. అది కూడా వైల్డ్ లైఫ్ చట్టాల కింద ఆమెపై కేసు నమోదు అయింది. కొద్దిరోజుల క్రితం ఆమె మాట్లాడుతూ.. తాను జింక, కుందేళ్లు, అడవి పంది, మానిటర్ లిజర్డ్, ముళ్ల పంది మాంసాలను తిన్నట్లు తెలిపింది. ఇదే ఆమె కొంప ముంచింది.


ఆమె చెప్పిన అన్ని వన్య ప్రాణులు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 కింద రక్షణ పొందుతున్నాయి. వాటిని వేటాడటం, హాని కలిగించటం లేదా తినటం వంటివి చట్ట విరుద్దం. తాను ఆ జీవులన్నింటిని తిన్నానని ఆమె చెప్పటంతో .. ది ప్లాంట్ అండ్ అనిమల్ వెల్ఫేర్ సొసైటీ ( పా) ఆగ్రహించింది. థానే చీఫ్ కంజర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ ది డివిజినల్ ఫారెస్ట్ ఆఫీసర్‌కు పా సభ్యులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న అటవీ శాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు అధికారులు ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యలు నిజామా.. కాదా.. అన్న దానిపై విచారణ మొదలుపెట్టారు. ఆమెకు సహకరించిన వేటగాళ్ల గురించి కూడా టీం ఆరా తీస్తోంది.


ఇక, ఈ కేసుపై ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రాకేష్ భోయర్ మాట్లాడుతూ.. ‘ మేము కదమ్‌తో ఫోనులో టచ్‌లో ఉన్నాము. ఆమె ప్రస్తుతం సినిమా షూటింగు కోసం వేరే సిటీకి వెళ్లిందట. నాలుగు రోజుల తర్వాత వస్తుందట. తను లాయర్‌ సలహా తీసుకున్న తర్వాత విచారణకు హాజరవుతానని చెప్పింది. మేము వన్య ప్రాణులను వేటాడి చంపి, మాంసం అమ్మిన వారిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. తప్పు చేసిన వారికి కఠినమైన శిక్షలు ఉంటాయి’ అని స్పష్టం చేశారు. కదమ్‌పై వైల్డ్ లైఫ్ కేసు నమోదు కావటం బాలీవుడ్ సర్కిల్‌లో చర్చనీయాంశంగా మారింది. ఒక వేళ కదమ్ వన్య ప్రాణుల మాంసం తిన్నట్లు రిజువైతే.. ఆమెకు జైలు శిక్షతో పాటు జరిమానా కూడా పడే అవకాశం ఉంది.


ఇవి కూడా చదవండి

భర్త గడ్డం అడ్డం అయింది.. మరిదితో పరారైన వదిన

Black Alien: ఏలియన్‌గా మారటం కోసం చేతి వేళ్లు, నాలుక కోయించుకున్నాడు..

Updated Date - May 01 , 2025 | 04:35 PM