Bus Driver Watching Bigg Boss: బస్సు నడుపుతూ బిగ్‌బాస్ చూసిన డ్రైవర్.. వైరల్‌గా మారిన దృశ్యాలు..
ABN , Publish Date - Nov 09 , 2025 | 10:49 AM
ఓ బస్ డ్రైవర్ బస్ నడుపుతూ నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. 80 కిలోమీటర్ల వేగంతో బస్సు నడుపుతూ సెల్ ఫోన్‌లో బిగ్‌బాస్ చూస్తూ ఉన్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ మధ్య కాలంలో బస్సు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోయాయి. కర్నూలు, సంగారెడ్డి జిల్లాల్లో చోటుచేసుకున్న బస్సు ప్రమాదాల కారణంగా 40 మంది దాకా చనిపోయారు. తరచుగా రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఎక్కడో ఓ చోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇక, దేశ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం నిర్లక్ష్యంగా తెలుస్తోంది. ప్రస్తుతం ఓ వీడియో ప్రైవేట్ బస్సుల్లో సేఫ్టీపై అనుమానాలు తలెల్తేలా చేస్తోంది. ఓ బస్ డ్రైవర్ బస్ నడుపుతూ నిర్లక్ష్యంగా వ్యవహరించాడు.
80 కిలోమీటర్ల వేగంతో బస్సు నడుపుతూ సెల్ ఫోన్‌లో బిగ్‌బాస్ చూస్తూ ఉన్నాడు. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఓ యువకుడు అక్టోబర్ 27వ తేదీన వీఆర్ఎల్ ట్రావెల్స్ బస్‌లో ముంబై నుంచి హైదరాబాద్ బయలు దేరాడు. బస్సు హైవేపైకి రాగానే డ్రైవర్ సెల్ ఫోన్‌లో బిగ్ బాస్ షో చూడ్డం మొదలెట్టాడు. ఇది గమనించిన యువకుడు షాక్ అయ్యాడు. వెంటనే ఆ దృశ్యాలను తన ఫోన్‌లో రికార్డు చేశాడు. తర్వాత ఆ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేశాడు. వీడియో వైరల్‌గా మారింది.
ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ఇలాంటి వాళ్ల వల్లే అమాయక ప్రయాణికులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు’..‘వాహనాలు నడుపుతూ నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని కఠినంగా శిక్షించాలి’.. ‘బస్సుల్లోనే కాదు. ఈ మధ్య ఆటో డ్రైవర్‌లు కూడా ఆటో నడుపుతూ సెల్ ఫోన్‌లో రీల్స్ చూస్తున్నారు’..‘90 శాతం యాక్సిడెంట్లు ఇలాంటి వాళ్ల వల్లే జరుగుతున్నాయి’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
నేటితో ముగియనున్న బీహార్ రెండో విడత ఎన్నికల ప్రచారం
సింహాన్ని ఆపేదెవరు.. మొసలిని చూసిన మృగరాజు ఏం చేసిందో చూడండి..