Buck Moon: బక్ మూన్.. చంద్రునికి ఈ పేరు ఎందుకు పెట్టారో తెలుసా?
ABN , Publish Date - Jul 10 , 2025 | 02:45 PM
గురు పౌర్ణమి రోజున కనిపించే చంద్రుడికి బక్ మూన్ అనే ప్రత్యేకమైన పేరు ఉంది. అసలు బక్ మూన్ అంటే ఏమిటి? ఈ పేరుని ఎందుకు పెట్టారు? దీని వెనుక ఉన్న కథ ఏంటో తెలుసుకుందాం..

ఇంటర్నెట్ డెస్క్: గురు పౌర్ణమి రోజున కనిపించే చంద్రుడికి బక్ మూన్ అనే ప్రత్యేకమైన పేరు ఉంది. ఇది సాధారణ పౌర్ణమి చంద్రుడికి భిన్నంగా, కొంచెం ఎర్రటి చాయతో కనిపిస్తుంది. అసలు బక్ మూన్ అంటే ఏమిటి? ఈ పేరుని ఎందుకు పెట్టారు? దీని వెనుక ఉన్న కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
బక్ మూన్ అనే పేరు ఎలా వచ్చింది?
బక్ మూన్ అనే పేరు అమెరికా ప్రాంతంలోని అల్గాన్‌క్విన్ తెగ ప్రజలతో ముడిపడి ఉంది. ప్రకృతికి సంబంధించిన మార్పులను గమనిస్తూ ప్రతి పౌర్ణమికి ఒక ప్రత్యేకమైన పేరు పెట్టే సంప్రదాయం ఈ తెగ ప్రజలకు ఉంది. అలా జూలైలో కనిపించే పౌర్ణమికి వారు 'బక్ మూన్' అనే పేరు పెట్టారు. బక్ అంటే మగ జింక. జులై నెలలో మగ జింకలకు పాత కొమ్ములు రాలిపోయి.. కొత్త కొమ్ములు పెరుగుతాయి. కాబట్టి, అదే సమయంలో వచ్చే పౌర్ణమిని గుర్తుంచుకునేందుకు బక్ మూన్ అనే పేరును పెట్టారు.
బక్ మూన్ ఎందుకు భిన్నంగా కనిపిస్తుంది?
బక్ మూన్ సాధారణ చంద్రుని కంటే కొంచెం ప్రకాశవంతంగా, కొన్నిసార్లు ఎరుపు లేదా బంగారు రంగులో మెరుస్తూ కనిపిస్తుంది. దీని వెనుక ఒక శాస్త్రీయ కారణం ఉంది. చంద్రుని ఉపరితలంపై పడే సూర్యకాంతి.. భూమికి చేరే మార్గంలో గాలిలోని ధూళి, ఆణువులు వలన కాంతి పక్కదారి పడుతుంది. దీని ఫలితంగా చంద్రుడు కొన్నిసార్లు ఎర్రగా కనిపిస్తాడు. సాధారణంగా ఇది రాత్రి సమయంలో కనిపిస్తుంది.
ఇతర పేర్లు కూడా ఉన్నాయి!
బక్ మూన్‌ను కొన్ని తెగలు ఇతర పేర్లతో కూడా పిలుస్తారు. ఈ కాలంలో వర్షాలు, ఉరుములు ఎక్కువగా ఉండటం వల్ల థండర్ మూన్ అని, కొన్ని ప్రాంతాల్లో సాల్మన్ చేపలు ప్రవాహానికి వ్యతిరేక దిశలో పయనిస్తాయి కాబట్టి సాల్మన్ మూన్ అని పిలుస్తారు.
Also Read:
ఈ పొరపాటు భార్యాభర్తల మధ్య తగాదాలను పెంచుతుంది.!
గూగుల్ క్రోమ్‌కి కాంపిటీషన్.. త్వరలో ఓపెన్ఏఐ నుంచి కొత్త బ్రౌజర్..!
For More National News