Baba Vanga: ప్రపంచానికి పెను ప్రమాదం.. బాబా వంగ జోష్యం నిజం కానుందా
ABN , Publish Date - Apr 20 , 2025 | 09:15 AM
Baba Vanga Prophecy: బాబా వంగ చెప్పిన కాలజ్ణాన విషయాలకు ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ ఉంది. ఆమె చెప్పినవి చెప్పినట్లు జరుగుతూ ఉన్నాయి. ప్రముఖుల మరణాల దగ్గర నుంచి కరోనా వైరస్ వరకు ఆమె చెప్పినవన్నీ జరిగాయి.. ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి.

తెలుగు ప్రజలకు వీర బ్రహ్మేంద్ర స్వామి కాలజ్ణానం ఎంత ఫేమసో.. ప్రపంచ వ్యాప్తంగా బాబా వంగ కాలజ్ణానం అంత ఫేమస్. ఆమె చెప్పింది నూటికి 80 శాతం కచ్చితంగా జరుగుతుంది. ఆమె చనిపోయే వరకు కాలజ్ణానం చెబుతూ వచ్చింది. అప్పుడు ఆమె చెప్పినవి ఇప్పుడు ఒక్కొక్కటిగా జరుగుతూ వస్తున్నాయి. ఫ్రెడ్డీ మెర్క్యూరీ, ప్రిన్స్ డయానా చచ్చిపోతారని ఆమె ముందే చెప్పింది. 2011 కోబ్ భూకంపం గురించి, కోవిడ్ 19 గురించి కూడా ఆమె జోష్యం చెప్పింది. అవన్నీ జరిగాయి కూడా. బతికున్నపుడు ఆమె చెప్పిన ఓ జోష్యం ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతోంది. 2025లో జపాన్‌లో మెగా సునామీ వస్తుందని అంది.
ఆమె కలలో దేశం దక్షిణం వైపు ఉన్న సముద్రం మరుగుతున్నట్లు కనిపించిందట. 2025, జులై నెలలో జపాన్‌లో మెగా సునామీ వస్తుందని ఆమె జోష్యం చెప్పింది. ఆ సునామీ ప్రభావం ఒక్క జపాన్‌పైనే కాకుండా ఏషియన్ దేశాల మీద కూడా ఉంటుందని పేర్కొంది. తన కలలో డ్రాగన్ లాంటి ఆకారాలు కూడా కనిపించాయని అంది. జపాన్ అధికారులు కూడా ఆమె చెప్పిన దాంట్లో వాస్తవం ఉందని అంటున్నారు. కొన్ని రోజుల క్రితం మెగా క్వేక్ వస్తుందని చైనా.. జపాన్ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసిందని, వేల మంది చనిపోయే అవకాశం ఉన్నట్లు ప్రకటించిందని అధికారులు తెలిపారు.
ఎవరీ బాబా వంగ
ప్రపంచ వ్యాప్తంగా బాబా వంగగా పేరు పొందిన ఈమె అసలు పేరు వంగేలియా పండేవా సర్చేవా. ఈమె అక్టోబర్ 3, 1911లో మెసడోనియాలో పుట్టింది. దృష్టి లోపం ఉన్న ఈమె భవిష్యత్తును అద్భుతంగా చెప్పేది. అప్పుడు ఆమె చెప్పినవి చెప్పినట్లు జరుగుతూ వస్తున్నాయి. ఆమె 1996లో 85 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆమె చనిపోయి సమాధిలో ఉన్నా.. ఆమె కలలో కనిపించిన వన్నీ జరుగుతున్నాయి. ప్రపంచాన్ని భయపెడుతూ ఉన్నాయి. అమెరికా ట్విన్ టవర్స్ కూల్చి వేత, 9/11 ముంబై ఉగ్రదాడుల గురించి కూడా బాబా వంగ ముందే చెప్పింది.
ఇవి కూడా చదవండి
Brides Mother: పచ్చి మోసం.. పిల్ల అని చెప్పి తల్లితో పెళ్లి చేశారు..
10th Class: టెన్త్ విద్యార్థికి ఎంత కష్టం వచ్చింది.. పరీక్ష పాస్ కాకపోతే బ్రేకప్..