Prabhas: ప్రభాస్ సినిమా కోసం నటుడి కష్టాలు
ABN , Publish Date - Jun 08 , 2025 | 07:39 AM
Anupam Kher: అనుపమ్ ఖేర్ ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కొత్త సినిమాలో నటిస్తున్నారు. పేరు కూడా ప్రకటించని ఆ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ సందర్భంగా అనుపమ్ ఇబ్బంది పడ్డారు.

అనుపమ్ ఖేర్ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. కార్తికేయ 2 సినిమాతో తెలుగు నాట మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కార్తికేయ 2 సినిమా బ్లాక్ బాస్టర్ అయిన తర్వాత అనుపమ్ ఖేర్‌కు తెలుగులో వరుస అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం ఆయన ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కొత్త సినిమాలో నటిస్తున్నారు. పేరు కూడా ప్రకటించని ఆ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ సందర్భంగా డ్రైవర్ చేసిన పనికి అనుపమ్ ఇబ్బంది పడ్డారు. గోడ దూకాల్సిన పరిస్థితి వచ్చింది.
ఈ సంఘటనకు సంబంధించి అనుపమ్ ఖేర్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో .. ‘ ఇటు వైపు నుంచి అటువైపు. 40 ఏళ్ల నా సినిమా జీవితంలో చాలా రకాలుగా షూటింగ్ లోకేషన్స్లోకి వెళ్లాను. కానీ, ఈ రోజు జరిగింది.. చాలా ప్రత్యేకమైనది, నవ్వు తెప్పించేది కూడా. నేను ప్రస్తుతం ప్రభాస్ కొత్త సినిమా కోసం హైదరాబాద్ వచ్చాను. కారులో షూటింగ్ లోకేషన్‌కు బయలుదేరాను. మా డ్రైవర్ కారును అడవి లాంటి ప్రాంతంలోకి తీసుకువచ్చాడు. ఓ చోట దారి ముగిసిపోయింది. వెనక్కు రావడానికి కూడా లేదు.
తర్వాత ఏం జరిగిందో మీరో చూడండి’ అని రాసుకొచ్చారు. కుచ్ బీ హో సక్తా హై అనే హ్యాష్ ట్యాగ్ కూడా యాడ్ చేశారు. ఆ వీడియోలో ఏముందంటే.. కారు ఆగిన చోట ఓ గోడ ఉంది. గోడకు అటు వైపు ప్రభాస్ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇటు వైపు అనుపమ్ ఖేర్ ఉన్నారు. కుర్చీ, చిన్న నిచ్చెన సాయంతో ఆయన గోడపైకి ఎక్కారు. తర్వాత అవతలికి దిగారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. 70 ఏళ్ల వయసులో అనుపమ్ ఖేర్ ఫిట్‌నెస్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. నిలకడగా బంగారం ధరలు..