Allu Arjun: అల్లు అర్జున్ నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా అని తెలుసా..
ABN , Publish Date - May 02 , 2025 | 08:35 PM
Allu Arjun T Shirt: ఆ పేరుతో మీమ్స్, వీడియోలు, ఆఖరికి హోటళ్లు కూడా పుట్టుకువచ్చాయి. అయితే, ఆ నెల్లూరు పెద్దారెడ్డికి మరింత క్రేజ్ తెచ్చేలా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఓ పని చేశారు.

అనగనగా ఒక రోజు సినిమాలో బ్రహ్మానందం ‘ నెల్లూరు పెద్దా రెడ్డి’ గురించి చెబుతాాడు. పోలీసులు తెలీదంటారు. ఆ పోలీసులకే కాదు.. ఇప్పటి వరకు ఆ నెల్లూరు పెద్దారెడ్డి ఎవరో ఎవ్వరికీ తెలీదు. సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత ఆ నెల్లూరు పెద్దారెడ్డి పేరు బాగా పాపులర్ అయింది. ఆ పేరుతో మీమ్స్, వీడియోలు, ఆఖరికి హోటళ్లు కూడా పుట్టుకువచ్చాయి. అయితే, ఆ నెల్లూరు పెద్దారెడ్డికి మరింత క్రేజ్ తెచ్చేలా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఓ పని చేశారు. అనగనగా ఒక రోజు సినిమాలో బ్రహ్మానందం క్యారెక్టర్ తాలూకా ఫొటోలు ఉండే టీషర్ట్ ధరించారు.
తెల్లటి టీషర్టుపై .. పోలీస్ స్టేషన్ సీన్‌లో పోలీస్ రికార్డుల్లో ఉండే ఫొటోలు ఉన్నాయి. వాటి కింద ‘ నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా’ అని అక్షరాలు కూడా ఉన్నాయి. కాస్ట్‌లీ బ్రాండ్ల టీషర్టులు వాడి బోర్ కొట్టినట్లు ఉంది. అందుకే కొత్త ట్రై చేశారు. అది కాస్తా ట్రెండ్‌గా మారబోతోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ టీషర్టు వేసుకున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. టీషర్టుపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ అన్న టీషర్ట్ సూపర్’.. ‘ ఐకాన్ స్టార్ కొత్త ట్రెండ్‌కు తెరతీశాడురో’..‘ రేపటినుంచి ఆ టీషర్టులో షాపుల్లో ఉంటాయి’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
బన్నీ సినిమా సంగతులు
అల్లు అర్జున్ ప్రముఖ తమిళ దర్శకుడు అట్లీతో సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కబోతోంది. సన్ పిక్చర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా తీస్తోంది. ఇక, ఈ సినిమాలో అల్లు అర్జున్ మూడు పాత్రల్లో కనిపించనున్నారన్న టాక్ నడుస్తోంది. ప్రస్తుతం హీరోయిన్ ఎంపిక జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే చాలా మంది స్టార్ హీరోయిన్ల పేరు తెరపైకి వచ్చాయి. అయితే, ఏ హీరోయిన్ ఫిక్స్ కాలేదని సమాచారం. నేషనల్ లెవెల్‌లో క్రేజ్ ఉన్న హీరోయిన్‌నే తీసుకుంటారని తెలుస్తోంది.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా
ఇవి కూడా చదవండి
11 ఏళ్ల పిల్లాడితో టీచర్ ప్రేమ.. చివరకు కథ అడ్డం తిరిగి..
Narendra Modi: NTR కల సాకారం చేస్తాం.. హామీ ఇచ్చిన ప్రధాని మోదీ