Share News

Techie looses Job to AI: ఏఐ ఎఫెక్ట్.. రూ.1.2 కోట్ల జీతం వచ్చే జాబ్ మటాష్

ABN , Publish Date - May 17 , 2025 | 03:42 PM

ఏఐ రాకతో తన జీవితం తలకిందులైపోయిందంటూ ఓ టెకీ షేర్ చేసిన ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

Techie looses Job to AI: ఏఐ ఎఫెక్ట్.. రూ.1.2 కోట్ల జీతం వచ్చే జాబ్ మటాష్
Techie looses Job to AI

ఇంటర్నెట్ డెస్క్: ఏఐ రాకతో తన జీవితం ఎలా తలకిందులైందో చెబుతూ ఓ టెకీ మీడియాతో పంచుకున్న ఉదంతం ప్రస్తుతం ఆందోళన రేకెత్తిస్తోంది. ఏఐ దెబ్బకు జాబ్ కోల్పోయిన ఈ టెకీ సామాన్యుడేమీ కాదు. 42 ఏళ్ల వయసు.. రెండు దశాబ్దాల పాటు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా అనుభవం.. ఎన్నో సార్లు ఎదురుదెబ్బలు తట్టుకున్నా తిరిగి నిలబడ్డ ధీరత్వం. కానీ ఈసారి జాబ్ పోవడం మాత్రం సాధారణ విషయం కాదని అతడు చెప్పుకొచ్చాడు. ప్రస్తుత ఉద్యోగాల్ని ఏఐ తీవ్రంగా ప్రభావితం చేస్తోందని ఆవేదన చెందాడు. ఒకప్పుడు రూ.1.2 కోట్ల వార్షిక శాలరీ అందుకున్న అతడు ప్రస్తుతం పూట గడిస్తేనే గొప్ప అనుకునే స్థితికి వచ్చేశాడు. పాత సామాన్లు అమ్ముకుని పొట్టపోసుకుంటున్నాడు.

అసలు ఏం జరిగిందీ చెబుతూ షాన్ కే అనే 42 ఏళ్ల కంప్యూటర్స్ సైన్స్ గ్రాడ్యుయేట్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. తానో ఫుల్ స్టాక్ ఇంజినీర్ అని చెప్పుకొచ్చాడు. వెబ్ టెక్నాలజీలతో పాటు వీఆర్, ఏఐ సాంకేతికతపై మంచి పట్టు ఉందని వివరించాడు. ఏఐ కారణంగా టెక్ ఇండస్ట్రీ సమూల మార్పులకు లోనవుతోందని చెప్పుకొచ్చాడు. గతేడాది జాబ్ కోల్పోయినట్టు తెలిపాడు.


ఆ తరువాత 800 జాబ్స్‌కు దరఖాస్తు చేసుకోగా కేవలం 10 జాబ్ ఇంటర్వ్యూలకే పిలుపు వచ్చిందని తెలిపాడు. ఏదోక కంపెనీ నుంచి పిలుపు వస్తుందని రోజుల తరబడి ఎదురుచూస్తుంటానని, కానీ తన ఈమెయిల్ మాత్రం ఖాళీగానే కనిపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశాడు. తన రెస్యూమేను మనుషులు చూసే ముందే ఏఐ ఏజెంట్స్ పక్కన పెట్టేస్తున్నాయని వాపోయాడు. ఒకప్పుడు తాను ఏటా 150,000 డాలర్లు (రూ.1.2 కోట్లు) సంపాదించేవాడినని అన్నాడు. కానీ జనరేటివ్ ఏఐ (చాట్‌జీపీటీ లాంటివి) ఉనికిలోకి వచ్చాక తన కెరీర్ బుగ్గిపాలైపోయిందని అన్నాడు.

ప్రస్తుతం కే న్యూయార్క్‌లో ఉంటున్నాడు. ఓ చిన్న వ్యాన్ లాంటి వాహనమే అతడి నివాసం. ఒక పూట తిండి కోసం అతడు డెలివరీ ఏజెంట్‌గా మారిపోయాడు. డబ్బులు సరిపోని సందర్భాల్లో పాత సామాన్లు అమ్ముకుని బతుకీడుస్తున్నాడు. నిత్యం ఏదోక జాబ్స్‌కు దరఖాస్తు చేసుకుంటూనే ఉన్నానని అతడు చెప్పుకొచ్చాడు. ఏడాదిగా జాబ్ లేకపోవడంతో కొత్త నైపుణ్యాలు నేర్చుకునేందుకు కూడా డబ్బులు లేవని వాపోయాడు.


ఇది కేవలం తన ఒక్కడి సమస్యగానే భావించొద్దని జనాలను కే హెచ్చరించాడు. రాబోయే ముప్పునకు ఇది ట్రెయిలర్ మాత్రమే అని అప్రమత్తం చేశాడు. ఏఐతో ఉత్పాదకత పెంచుకుని ఖర్చులు తగ్గించుకునేందుకు కంపెనీలు లక్షల మంది ఉద్యోగులను తొలగిస్తాయిని హెచ్చరించాడు. ఇక ఏఐతో జాబ్ ఎప్పుడు పోతుందా అని జనాలు ఎదురుచూడటమే మిగిలిందని నిర్వేదం వ్యక్తం చేశాడు. తానేమీ ఏఐకి వ్యతిరేకం కాదని కూడా కే అన్నాడు. అయితే, ఏఐని ఇప్పుడు వినియోగిస్తున్న తీరుపైనే తన అభ్యంతరమని చెప్పాడు.

ఇటీవల ఓ టీవీ షోలో మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కూడా దాదాపుగా ఇదే విషయం చెప్పారు. ప్రస్తుతం మనుషులు చేస్తున్న అనేక పనులు రాబోయే రోజుల్లో ఏఐ చేస్తుందని స్పష్టం చేశారు. చివరకు జనాలు వారానికి రెండు లేదా మూడు రోజులకు మించి పని చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చని అన్నారు.

ఇవి కూడా చదవండి:

పనిమనిషి బండారం బయటపెట్టిన ఫేస్‌బుక్ ఫొటో

ఇరుగుపొరుగు వారి ఫిర్యాదుతో బయటపడ్డ దారుణం.. వృద్ధురాలిపై పోలీసుల దర్యాప్తు

నడిరోడ్డులో బెంగళూరు మహిళకు వేధింపులు.. సాయం అడిగినా పట్టించుకోని జనాలు

ఐసీయూలో ఎయిర్‌హోస్టస్‌పై అత్యాచారం.. ఎట్టకేలకు పోలీసుల అదుపులో నిందితుడు

Read Latest and Crime News

Updated Date - May 17 , 2025 | 03:52 PM