Share News

Jagga Reddy: జగ్గారెడ్డి మాస్ డైలాగ్.. రాజకీయాల్లో విలన్ మేమే, హీరోలం మేమే

ABN , Publish Date - Apr 28 , 2025 | 06:40 PM

Jagga Reddy Counter To KCR: కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి బీఆర్ఎస్ అధినేత KCRపై మండిపడ్డారు. ‘ ఈ వయసులో దిగజారుడు రాజకీయాలు కేసీఆర్‌కు అవసరమా?.. ఇంత అనుభవమున్న కేసీఆర్ ఎందుకు టెంప్ట్ అవుతున్నారు. కేసీఆర్ ఎన్ని రాష్ట్రాలకు ఎన్ని సంచులు మోసాడో తెలియదా?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Jagga Reddy: జగ్గారెడ్డి మాస్ డైలాగ్.. రాజకీయాల్లో విలన్ మేమే, హీరోలం మేమే
Jagga Reddy Mass Counter

తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావుపై ఫైర్ అయ్యారు. రాహుల్ గాంధీ గురించి మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్‌కు లేదని అన్నారు. రాహుల్ గాంధీకి కేసీఆర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ రాజకీయాల్లో విలన్ మేమే, హీరోలం మేమే. ప్రజల విషయంలో హీరోలుగా ఉంటాం, ప్రతిపక్షాలకు విలన్లుగా ఉంటాం. రేవంత్ రెడ్డికి భయపడే కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లడం లేదు. ఈ వయసులో దిగజారుడు రాజకీయాలు కేసీఆర్‌కు అవసరమా?.. ఇంత అనుభవమున్న కేసీఆర్ ఎందుకు టెంప్ట్ అవుతున్నారు.


కేసీఆర్ ఎన్ని రాష్ట్రాలకు ఎన్ని సంచులు మోసాడో తెలియదా?. కేసీఆర్ ఆరేడు రాష్ట్రాలకు సంచులు పంపాడు. రాహుల్ గాంధీ కుటుంబం త్యాగాలకు నిలయం. సోనియా తెలంగాణ ఇవ్వడం వల్లే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. తెలంగాణ ఇచ్చే సమయంలో దేవుళ్ళుగా కనిపించిన సోనియా, రాహుల్ ఇప్పుడు దయ్యాలుగా కనిపిస్తున్నారా?. సోనియా గాంధీ ఏ నిర్ణయం తీసుకున్నా రాహుల్ గాంధీకి చెప్పి చేస్తుంది. రాహుల్ గాంధీ చెప్పిన తర్వాతనే విభజన ప్రక్రియ మొదలైంది. కేసీఆర్ లిమిట్స్ దాటి మాట్లాడారు. ఉనికి కోసమే కేసీఆర్ మాట్లాడారు. కేసీఆర్ గతాన్ని మర్చిపోయి మాట్లాడడం సరైంది కాదు.


తెలంగాణ ఉద్యమానికి కాంగ్రెస్ నేతలంతా సహకరించారు. కేసీఆర్ ఓపిక నశించి పడిపోతున్న సమయంలో ఆయన్ని లేపింది కాంగ్రెస్ నేతలే. కేసీఆర్‌కు భరోసా ఇచ్చి నిలబెట్టింది కాంగ్రెస్ నేతలే. కేసీఆర్ నోరు జారి రాహుల్ గాంధీపై విమర్శలు చేశారు. సోనియా గాంధీ అపాయింట్మెంట్ కోసం కేసీఆర్ రోజుల తరబడి ఎదురుచూచారు’ అని అన్నారు.


ఇవి కూడా చదవండి

Meta AI Chatbot: అశ్లీలతకు అడ్డాగా మారిన మెటా ఏఐ చాట్ బాట్స్

Volleyball Player: వాలీబాల్ ప్లేయర్ వికృత రూపం.. వందల మంది అమ్మాయిలతో..

Updated Date - Apr 28 , 2025 | 06:41 PM