భారత్‌లో అత్యంత చవకైన ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కార్.. ఫీచర్స్ అదుర్స్

ABN, Publish Date - Jul 28 , 2025 | 01:51 PM

ఎమ్‌జీ కంపెనీ ఎట్టకేలకు భారత్‌లో తన ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు సైబర్‌స్టర్‌ను విడుదల చేసింది. రూ.74.99 ఎక్స్ షోరూం ధరతో రిలీజ్ చేసిన ఈ కారును ఇప్పటికే అనేక మంది ప్రీబుక్ చేసుకున్నారు. దేశంలో అత్యంత చవకైన 2 డోర్ కన్వర్టిబుల్ కారుగా పేరు పడ్డ ఈ వాహనం ఫీచర్స్ ఏంటో చూద్దం.

భారత్‌లో అత్యంత చవకైన ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కార్.. ఫీచర్స్ అదుర్స్ 1/7

ఎమ్‌జీ సైబర్‌స్టర్ కారులో 77కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉంది. ఒక్కసారి బ్యాటరీని చార్జ్ చేస్తే 580 కిలోమీటర్లు నిరాఘాటంగా ప్రయాణించొచ్చు.

భారత్‌లో అత్యంత చవకైన ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కార్.. ఫీచర్స్ అదుర్స్ 2/7

ఇందులోని డ్యూయెల్ ఎలక్ట్రిక్ మోటార్ సెటప్‌తో 725 ఎన్ఎమ్ టార్క్, 510 బీహెచ్‌పీ శక్తి ఉత్పత్తి అవుతుంది.

భారత్‌లో అత్యంత చవకైన ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కార్.. ఫీచర్స్ అదుర్స్ 3/7

సైబర్‌స్టర్ కేవలం 3.2 సెకెన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. గరిష్ఠంగా 200 కిలోమీటర్ల వేగంతో ఇది ప్రయాణిస్తుంది.

భారత్‌లో అత్యంత చవకైన ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కార్.. ఫీచర్స్ అదుర్స్ 4/7

సూపర్ ఫాస్ట్ చార్జర్‌‌తో కేవలం 40 నిమిషాల్లో బ్యాటరీని 10 శాతం నుంచి 80 శాతానికి చార్జ్ చేసుకోవచ్చు.

భారత్‌లో అత్యంత చవకైన ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కార్.. ఫీచర్స్ అదుర్స్ 5/7

ఈ కన్వర్టబుల్ కారులో 10.25 అంగుళాల డిజిటల్ క్లస్టర్, 7 అంగుళాల డిస్‌ప్లే, యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ స్టీరింగ్, 8 స్పీకర్ బేస్ ఆడియో సిస్టమ్ తదితర ఫీచర్స్ ఉన్నాయి

భారత్‌లో అత్యంత చవకైన ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కార్.. ఫీచర్స్ అదుర్స్ 6/7

వెహికిల్ టు లోడ్, గాల్లోని సూక్ష్మ కణాలను ఫిల్టర్ చేసే పీ.ఎమ్ 2.5 ఫిల్టర్, మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్స్, టీపీఎమ్ఎస్, 360 డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి.

భారత్‌లో అత్యంత చవకైన ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కార్.. ఫీచర్స్ అదుర్స్ 7/7

మొత్తం నాలుగు రంగుల్లో ఇది అందుబాటులో ఉంది. ఆండస్ గ్రే, రెడ్ రూఫ్, ఫ్లే్ర్ రెడ్, బ్లాక్ రూఫ్‌ల్లో నచ్చిన దాని వినియోగదారులు ఎంచుకోవచ్చు.

Updated at - Jul 28 , 2025 | 02:00 PM