జామకాయ vs అవకాడో.. ఏది మంచిదో తెలుసా?

ABN, Publish Date - Jul 24 , 2025 | 06:01 PM

పండ్లు మన ఆహారంలో ఎప్పుడూ ముఖ్యమైన భాగంగా ఉంటాయి. ఆపిల్‌ నుంచీ అవకాడో వరకూ, ప్రతి పండు దాని దైన ప్రత్యేకతలు, ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటాయి. వీటిని ఎక్కువగా తాజాగా పచ్చిగానే తింటాం.

జామకాయ vs అవకాడో.. ఏది మంచిదో తెలుసా? 1/6

జామకాయ.. అవకాడో.. ఈ రెండు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. అయితే, వీటిలో ఏది ఎక్కువ మేలు చేస్తుంది? వాటి ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి అనే షయాలను తెలుసుకుందాం..

జామకాయ vs అవకాడో.. ఏది మంచిదో తెలుసా? 2/6

జామకాయలు ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతాయి.

జామకాయ vs అవకాడో.. ఏది మంచిదో తెలుసా? 3/6

జామకాయ సాధారణంగా సంవత్సరం పొడవునా లభించినప్పటికీ, ఇది ప్రధానంగా శీతాకాలంలో పండుతుంది. జామకాయను ముక్కలుగా కట్ చేసుకుని వాటిపై కాస్తా ఉప్పు, కారం చల్లుకుని తింటే భలే ఉంటుంది.

జామకాయ vs అవకాడో.. ఏది మంచిదో తెలుసా? 4/6

అవకాడోలో అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి గుండె జబ్బుల నుండి రక్షించడంలో సహాయపడతాయి, బరువు తగ్గడానికి సహాయపడతాయి, కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.

జామకాయ vs అవకాడో.. ఏది మంచిదో తెలుసా? 5/6

అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. మీరు దీనిని ముక్కలుగా కోసి తినవచ్చు. లేదా సలాడ్లు, శాండ్విచ్‌లు, గుడ్లతో లేదా ఇతర వంటకాల్లో చేర్చవచ్చు.

జామకాయ vs అవకాడో.. ఏది మంచిదో తెలుసా? 6/6

జామకాయ, అవకాడో రెండు కూడా ఆరోగ్యకరమైన పండ్లు. కానీ వాటి పోషక విలువలు, ప్రయోజనాలు వేరుగా ఉంటాయి. మీ ఆరోగ్య అవసరాలను బట్టి, రెండు పండ్లను మీ ఆహారంలో చేర్చుకోవడం మంచిది.

Updated at - Jul 24 , 2025 | 06:13 PM