ఘనంగా బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు
ABN, Publish Date - Apr 28 , 2025 | 07:20 AM
హనుమకొండ జిల్లా: 25వ వసంతంలోకి అడుగుపెడుతోన్న అప్పటి టీఆర్ఎస్.. నేటి బీఆర్ఎస్.. రజతోత్సవ సభ ఆదివారం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో జరిగింది. ఈ సభకు భారీగా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తెలంగాణకు ఎప్పుడూ నంబర్‌వన్ విలన్ కాంగ్రెస్ పార్టీయేనని, మోసపూరితమైన హామీలతో అధికారంలోకి వచ్చి రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిని దెబ్బతీసిందని అన్నారు.

హనుమకొండ జిల్లా, ఎల్కతుర్తిలో ఆదివారం నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో ప్రసంగించిన కేసీఆర్

బీఆర్ఎస్ రజతోత్సవ సభలో ప్రజలకు అభివాదం తెలుపుతున్న మాజీ మంత్రి కేటీఆర్..

రజతోత్సవ సభ వేదికపై బీఆర్ఎస్ నేతలు..

హనుమకొండ జిల్లా, ఎల్కతుర్తిలో నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభకు భారీగా హాజరైన జనం..

బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఎడ్ల బండ్లుపై వచ్చిన కార్యకర్తలు..

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం వినేందుకు భారీగా తరలి వచ్చిన ప్రజలు..
Updated at - Apr 28 , 2025 | 07:21 AM