CM Chandrababu : విశాఖలో త్వరలోనే గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు

ABN, Publish Date - Jul 29 , 2025 | 07:49 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డేటా సెంటర్ల ఏర్పాటుకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రత్యేకించి విశాఖలో దీనికి అవసరమైన ఎకో సిస్టం ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. సింగపూర్ లో మూడోరోజు పర్యటిస్తున్న సీఎం ఆ దేశ పారిశ్రామికవేత్తలు, కంపెనీల ప్రతినిధులతో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

CM Chandrababu : విశాఖలో త్వరలోనే గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు 1/5

సింగపూర్‌ దేశ పారిశ్రామికవేత్తలు, కంపెనీల ప్రతినిధులతో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం చంద్రబాబు

CM Chandrababu : విశాఖలో త్వరలోనే గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు 2/5

రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సుకు హాజరై తమ అభిప్రాయాలను తెలిపిన మొత్తం 41 కంపెనీలకు చెందిన ప్రతినిధులు

CM Chandrababu : విశాఖలో త్వరలోనే గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు 3/5

త్వరలోనే విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కానుందని, అలాగే టీసీఎస్, కాగ్నిజెంట్ సహా వివిధ ఐటీ దిగ్గజ సంస్థలు విశాఖలో తమ సంస్థలను ఏర్పాటు చేస్తున్నాయని సింగపూర్ పారిశ్రామిక వేత్తలకు వివరించిన ముఖ్యమంత్రి

CM Chandrababu : విశాఖలో త్వరలోనే గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు 4/5

2026 జనవరి నాటికి ప్రారంభమయ్యే క్వాంటం వ్యాలీ ఎకో సిస్టంలో సింగపూర్ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు అవకాశముందని తెలిపిన సీఎం చంద్రబాబు

CM Chandrababu : విశాఖలో త్వరలోనే గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు 5/5

ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సుకు హాజరైన మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్, పి.నారాయణ, ఏపీ ఉన్నతాధికారులు

Updated at - Jul 29 , 2025 | 07:54 PM