Share News

NRI News: నిరాశ్రయులకు టిప్యాడ్ ఆధ్వర్యంలో ఫుడ్ డ్రైవ్

ABN , Publish Date - Apr 18 , 2025 | 09:46 PM

NRI News: తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ (TPAD) ఆధ్వర్యంలో నిరంతరం పలు సేవా కార్యక్రమాలు చేపడుతోంది.అందులోభాగంగా మరో సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

NRI News: నిరాశ్రయులకు టిప్యాడ్ ఆధ్వర్యంలో ఫుడ్ డ్రైవ్
NRI Dallas

డల్లాస్: తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ (TPAD) ఆధ్వర్యంలో నిరంతరం పలు సేవా కార్యక్రమాలు చేపడుతోంది. ఇప్పటికే రక్తదాన శిబిరాన్ని నిర్వహించి.. దీని ద్వారా 150 మందికి పైగా ప్రాణాలను రక్షించింది. అనంతరం తాజాగా మరో సేవా కార్యక్రమాన్ని చేపట్టింది. డల్లాస్ ప్రాంతంలో ఆశ్రయంతోపాటు ఆహారం లేకుండా జీవించే వారు కోసం.. ఆస్టీన్ స్ట్రీట్ హోమ్ లెస్ షెల్టర్‌ (Austin Street Homeless Shelter‌)ను తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ ఏర్పాటు చేసింది.

ఈ ఫుడ్ డ్రైవ్ కార్యక్రమంలో TPAD బృందం Food Drive Coordinator దీపికా రెడ్డి (Deepika Reddy)ఇంట్లోనే పాస్తా, చికెన్, మాష్డ్ పొటాటో వంటకాలను సిద్దం చేశారు. ఈ ఆహార పదార్థాలను TPAD బృందం Austin Street Shelter‌కు తరలించారు. అనంతరం నిరాశ్రయులకు వారే స్వయంగా వడ్డించారు.


NRI-Dallas-2.jpgఈ సందర్భంగా Rao Kalvala (FC Chair), Pandu Palway (BOT Chair), Anuradha Mekala (President), Ramana Lashkar (Coordinator)తోపాటు Food Drive Coordinator Deepika Reddy మాట్లాడుతూ.. ఈ Food Driveలో 450 మందికిపైగా నిరాశ్రయులకు ఆహారాన్ని అందించామని తెలిపారు. TPADకి చెందిన 50 మంది వాలంటీర్లు ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారని చెప్పారు.


NRI-Dallas-3.jpg

సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలలో పాల్గొనడం TPAD తమ సామాజిక బాధ్యతగా భావిస్తుందని వారు స్పష్టం చేశారు. భవిష్యత్తులో సైతం ఇటువంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. TPAD సీనియర్ నాయకుడు, FC Vice Chair Raghuveer Bandaru ఈ Food Driveకు మార్గదర్శనం చేశారు. అంటే ఈ కార్యక్రమం కోసం గ్రాసరీ కొనుగోలు చేయడం దగ్గర నుంచి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసే వారకు ఆయన దగ్గరుండి మరీ పర్యవేక్షించడం విశేషం.

ఈ వార్తలు కూడా చదవండి..

SC Categorisation: ఎస్సీ వర్గీకరణపై ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు

CM Revanth Tour: జపాన్‌లో సీఎం రేవంత్ బిజీ బిజీ.. రుద్రారంకు ఇంటర్నేషనల్ కంపెనీ

Vijayasai Reddy: పార్టీ ఎందుకు వీడానో గుట్టు విప్పిన విజయసాయిరెడ్డి

Somireddy Chandramohan Reddy: చాలా రోజులైపోయింది చూసి.. నిద్ర పట్టడం లేదు

UttarPradesh: పోలీస్ బదిలీ.. కదిలిన ఊరి జనం

Kishan Reddy: ఎంఐఎంకు ఆ పార్టీలు జీ హుజూరంటున్నాయి: కిషన్ రెడ్డి

For NRI News And Telugu News

Updated Date - Apr 18 , 2025 | 09:50 PM