Share News

NRI: వర్జీనియాలో తెలుగు ఆడపడుచుల గోరింటాకు పండుగ

ABN , Publish Date - Jul 22 , 2025 | 10:11 PM

ఆషాఢ మాసం సందర్భంగా వర్జీనియాలో తానా ఆధ్వర్యంలో తెలుగు ఆడపడుచుల గోరింటాకు పండుగ ఘనంగా నిర్వహించారు.

NRI: వర్జీనియాలో తెలుగు ఆడపడుచుల గోరింటాకు పండుగ
TANA

  • తానా ఆధ్వర్యంలో ఆషాడ మాసం సందర్భంగా పండగ నిర్వహణ

  • అమెరికాలో తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలకు అద్దం పట్టిన కార్యక్రమాలు

వర్జీనియా, జులై 22: ఏ దేశంలో ఉన్నా మన సంస్కృతి, సంప్రదాయాల్ని కాపాడుకోవడంలో తెలుగు మహిళలు ప్రధాన పాత్ర పోషిస్తారని తానా సాంస్కృతిక విభాగం కో ఆర్డినేటర్ సాయిసుధా పాలడుగు పేర్కొన్నారు. అమెరికాలో తెలుగు వారి జీవన విధానం, సంస్కారం, పండుగల్ని భావితరాలకు తెలియజేయడం కోసం.. భాష కట్టుబొట్టుల్ని కాపాడడం కోసం తానా ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుందని ఆమె తెలిపారు. ఆషాడ మాసాన్ని పురస్కరించుకొని అమెరికాలోని వర్జీనియాలో తానా ఆధ్వర్యంలో "ఆడపడుచుల గోరింటాకు పండుగ" కార్యక్రమాన్ని ఇటీవల ఘనంగా నిర్వహించారు.

Tana-01.jpg


Tana-02.jpgతానా అధ్యక్షుడు నరేన్ కొడాలి మాట్లాడుతూ.. అయిదు దశాబ్దాల తానా సుదీర్ఘ ప్రయాణంలో అనేక ఎత్తుపల్లాలు, మరెన్నో ఆటుపోట్లు తట్టుకుని సగర్వంగా నిలబడి తన ఉనికిని చాటుకుందన్నారు. భవిష్యత్తులో 50 వసంతాలకు చేరుకోనున్న సందర్భంగా "న భూతో న భవిష్యతి" అన్న రీతిలో తెలుగు వారికి కీర్తి దశదిశలా వ్యాప్తి చేసేలా వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ప్రవాసాంధ్రులు వీటిలో భాగస్వాములై విజయవంతం చేయాలంటూ ఈ సందర్భంగా ఆయన పిలుపు నిచ్చారు.


Tana-03.jpgఇక మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ..అమెరికాలోని తెలుగుదనాన్ని ఒక వేదిక మీదకు తీసుకు వచ్చి అమ్మ భాషకు, తెలుగు జాతికి గుర్తింపు, గౌరవాన్ని 'తానా' తీసుకొచ్చిందని ప్రశంసించారు. ఒక జాతి అస్థిత్వాన్ని, ప్రత్యేకతను చాటి చెప్పేది మాతృభాషేనని స్పష్టం చేశారు. "మాతృభాషను విస్మరించిన ఏ జాతి మనగుడ సాగించ లేదన్నారు. అనేక జాతులు మాతృభాషను విస్మరించి కాలగర్భంలో కలిసిపోయాయని గుర్తు చేశారు. ఇది చరిత్ర చెప్పే సత్యమన్నారు. భాష సాంస్కృతిక వారథి అని అభివర్ణించారు. అందుకే మాతృభాష..మృత భాష కాకూదని ఇక్కడి ప్రవాసాంధ్రులు చేస్తున్న కృషి అభినందనీయని పేర్కొన్నారు.


Tana-04.jpg

తానా సాంస్కృతిక విభాగం కో ఆర్డినేటర్ సాయిసుధా పాలడుగు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తానా అధ్యక్షుడు నరేన్ కొడాలి, సీనియర్ పాత్రికేయుడు డీఎన్ ప్రసాద్, గుంటూరు మిర్చి యార్డ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పెద్ద సంఖ్యలో స్థానిక తెలుగు మహిళలు పాల్గొన్నారు. అందరూ గోరింటాకు పెట్టుకున్నారు. ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతుల్ని అలరించాయి. ఈ కార్యక్రమంలో సుధీర్ కొమ్మి, జానీ నిమ్మలపూడి, రాజేష్ కాసరనేని, అనిత మన్నవ, శ్రీవిద్య సోమ, అనీల్ ఉప్పలపాటి, రవి అడుసుమిల్లి, భాను మాగులూరి, శాంతి పారుపల్లి, కవిత చల్లా, త్రిలోక్ కంతేటి, సాయి బొల్లినేని, సత్య సూరపునేని, ఉమాకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Tana-06.jpg


Tana-07.jpg

ఈ వార్తలనూ చదవండి:

ఖతర్ నుంచి స్వదేశానికి చేరుకున్న తెలుగు పాస్టర్లు

డల్లాస్‌లో ఎన్నారై టీడీపీ ఆత్మీయ సమావేశం.. పాల్గొన్న ఎమ్మెల్యే అరవిందబాబు

Read Latest and NRI News

Updated Date - Jul 22 , 2025 | 10:16 PM