Share News

కారణాలు మూడు

ABN , Publish Date - May 30 , 2025 | 05:06 AM

ఏ కార్యానికైనా దోహదకారులుగా మూడు కారణాలను పూర్వ వేదాంత గ్రంథాలు పేర్కొన్నాయి. అవి: నిమిత్తం, ఉపాదానం సహకారి. వీటికి పలు ఉదాహరణలను పూర్వులు చూపారు. వాటిలో కుండను ఉదాహరణగా...

కారణాలు మూడు

తెలుసుకుందాం

ఏ కార్యానికైనా దోహదకారులుగా మూడు కారణాలను పూర్వ వేదాంత గ్రంథాలు పేర్కొన్నాయి. అవి: నిమిత్తం, ఉపాదానం సహకారి. వీటికి పలు ఉదాహరణలను పూర్వులు చూపారు. వాటిలో కుండను ఉదాహరణగా చూపుతూ చేసిన వివరణ ప్రసిద్ధి చెందింది. మనం వీధిలో వెళ్తూ ఉంటాం. ఒక చోట మట్టి కుప్పగా పోసి ఉంటుంది. కొంత సమయం తరువాత మళ్ళీ అటువైపు వస్తూ గమనిస్తే... ఆ మట్టితో కుండలు, పాత్రలు చేసి ఉంటాయి. అంతకుముందు కేవలం మట్టి మాత్రమే ఉంది. ఇప్పుడు అవి వస్తువులుగా తయారయ్యాయి. అంటే ఒక కార్యం (పని) జరిగింది.. దానికి దోహదం చేసిన కారణాలు మూడుగా పూర్వులు పేర్కొన్నారు.

  • వాటిలో మొదటిది... మట్టితో దేన్ని తయారు చేయాలి? దానికోసం ఎటువంటి పనితనాన్ని చూపాలి? ఎలాంటి ఉపకరణాలు ఉపయోగించాలి? అని తెలిసి, వాటి ద్వారా ఆ కుండలను, పాత్రలను తయారు చేసిన వ్యక్తి. అతణ్ణి ‘నిమిత్త కారణం’ అంటారు.

  • ఇక... అతను ఆ వస్తువులను తయారు చేయడానికి మూల పదార్థమైన మట్టి... ‘ఉపాదాన కారణం’. దానితో ఆ వస్తువులు రూపొందుతాయి. అది అనేక రూపాల్లోకి మారుతుంది. కానీ ఏ రూపంలో ఉన్నా... మట్టిగా దాని స్వభావంలో మార్పు ఉండదు. స్వతహాగా ఆ వస్తువులుగా అది మారలేదు. నిమిత్త కారణమైన కుమ్మరి దాన్ని వస్తువులుగా తయారు చేస్తాడు.

  • అయితే... ఈ రెండు కారణాల వల్లా వస్తువులు తయారుకావు. ఆ మట్టిని కుండగానో, పాత్రగానో ఆకృతి తీద్దడానికి ఒక చక్రం, దాన్ని తిప్పుతూ ఉండడానికి ఒక కర్ర, పాత్రను సరైన రూపంలోకి తేవడానికి కర్ర ముక్క, చాకు, ఇనుపరేకు లాంటివి కూడా అవసరమే. వీటిని ‘సహకారి కారణాలు’ అంటారు.

ఇవి కూడా చదవండి

పాకిస్తాన్ టూర్.. బయ్యా సన్నీ యాదవ్‌ను అరెస్ట్ చేసిన ఎన్ఐఏ

ముగ్గురు భార్యల ముద్దుల మొగుడు.. మూడు ఫ్యామిలీలను పోషించలేక..

పాకిస్తాన్ టూర్.. బయ్యా సన్నీ యాదవ్‌ను అరెస్ట్ చేసిన ఎన్ఐఏ

ముగ్గురు భార్యల ముద్దుల మొగుడు.. మూడు ఫ్యామిలీలను పోషించలేక..

Updated Date - May 30 , 2025 | 05:07 AM