Actor Shivabalaji: ఆ విషయంలో నేను లక్కీ
ABN , Publish Date - Jun 01 , 2025 | 03:55 AM
నటుడు శివబాలాజీ తన సినీ జీవితం, పాత్రల ఎంపికపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘కన్నప్ప’ చిత్రం ఒక అనుకోని అవకాశం కాగా, జీవితంలో హ్యాపీనెస్‌నే నిజమైన సక్సెస్‌గా భావిస్తున్నానంటున్నారు.

వ్యాపార నేపథ్యం కలిగిన కుటుంబం నుంచి చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి నటుడిగా కొనసాగుతున్నారు శివబాలాజీ. రెండు దశాబ్దాలకు పైగా ఉన్న ఆయన కెరీర్‌లో చేసిన చిత్రాల సంఖ్య స్వల్పమే అయినా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న శివబాలాజీ ‘నవ్య’తో ముచ్చటించారు.
పాత్రల ఎంపికలో చాలా సెలెక్టివ్‌గా ఉంటున్న మీరు ‘కన్నప్ప’ చిత్రం చేయడానికి ప్రత్యేక కారణం?
అనుకోకుండా దొరికిన అవకాశం అది. నా క్యారెక్టర్ మొదట స్ర్కిప్ట్‌లో లేదు. ఒకరోజు మోహన్‌బాబుగారు, విష్ణు, నేను భోజనం చేస్తుండగా సడన్‌గా ‘శివ మన సినిమాలో ఎందుకు నటించడంలేదు?’ అని మోహన్‌బాబుగారు అడిగితే ‘శివ చేయతగ్గ పాత్ర ఇందులో లేదు నాన్నా’ అని విష్ణు చెప్పారు. ‘లేదు.. అతను మన సినిమాలో ఉండాలి’ అన్నారు. ఆ టాపిక్ అంతటితో ఆగిపోయింది. మోహన్‌బాబు గారు ‘కన్నప్ప’లో మహదేవశాస్త్రి పాత్ర పోషిస్తున్నారు. రెండు రోజుల్లో తన కొడుకు కుమారదేవ శాస్త్రి పాత్ర క్రియేట్ చేసి ‘ప్రతి సీన్‌లో నువ్వు నా పక్కన ఉంటావు.. చెయ్యి’ అని ఆదేశించారు. అటువంటి గొప్ప నటుడితో నటించే అవకాశం వచ్చింది. అందుకే ఇంకా ఏమీ ఆలోచించకుండా ఒప్పేసుకొన్నా.
మీరు పరిశ్రమలోకి వచ్చి 22 ఏళ్లయింది. కానీ నటించిన చిత్రాల సంఖ్య చాలా తక్కువ. ఎందుకలా?
నాకు ఇప్పటికీ ఏడాదికి ఐదారు చిత్రాల్లో అవకాశాలు వస్తున్నాయి. పారితోషికం బాగానే ఆఫర్ చేస్తున్నారు. కానీ డబ్బు కోసం మాత్రమే ఆలోచించి నిర్మాతకు నష్టం కలిగించలేను కదా! కథ నచ్చకపోతే నిర్మోహమాటంగా చెప్పేస్తాను. అలా నేను రిజెక్ట్ చేసిన కథలను వేరే వాళ్లతో తీస్తే అవి ఫెయిల్ అయ్యాయి. నేను రెండేళ్లకు ఒక సినిమా చేసినా, మంచి పారితోషికం, మంచి క్యారెక్టర్ దొరుకుతున్నాయి. సాధారణంగా ఇలా రెండేళ్లకో సినిమా చేస్తే జనం మరిచిపోతారని అంటుంటారు. కానీ నా విషయంలో అలా జరగడం లేదు. ఆ విషయంలో నేను లక్కీ.
కానీ సినిమాల సంఖ్య కూడా ముఖ్యమే కదా!
యాభై ఏళ్ల తర్వాత ఆ సంఖ్యను ఎవరు గుర్తు పెట్టుకుంటారు చెప్పండి! ప్రస్తుతం మనం హ్యాపీగా, కంఫర్ట్‌గా ఉన్నామా లేదా అనేది నాకు ముఖ్యం. చాలామంది సక్సెస్ సక్సెస్ అంటుంటారు కదా. నా దృష్టిలో సక్సెస్ అంటే హ్యాపీనెస్. మనం దేని కోసం పరిగెడుతుంటాం.. డబ్బు కోసం. డబ్బు దేనికి? హ్యాపీగా ఉండడానికి. నేను ప్రస్తుతం హ్యాపీగానే ఉన్నాను కదా. సంతోషాన్ని ఎలా వెదుక్కుంటామనేది మన చేతుల్లో ఉంది. దానికి గురించి ఎవరూ క్లాసెస్ చెప్పరు. మన చుట్లూ ఉన్న సమాజాన్ని పరిశీలిస్తూ మన జీవన విఽధానాన్ని మార్చుకుంటు ముందుకు వెళ్లాలి. హ్యాపీగా ఉండాలి. అదంత ఈజీ కాదు, అలాగని కష్టమూ కాదు. ప్రతి రోజూ ఎందుకు టెన్షన్‌తో పరుగులు తీయడం? ఏముంది నీ చేతిలో.. అన్ని ఇతరుల చేతుల్లో ఉంటాయి. రోజూ ఎవరో ఒకరిని కలవాలి.. తెలియని వాళ్ల దగ్గరకు వెళ్లి పరిచయం చేసుకోవాలి. కాకా పట్టాలి.. కబుర్లు చెప్పాలి... ఇవన్నీ నిజంగా నాకు తెలీదు. నా ఐడెంటీటీని చంపుకోవడం నాకు ఇష్టం లేదు. మరి నేను నేనుగా బతకాలి, హ్యాపీగా ఉండాలని ఆలోచించి నా మార్గాన్ని నేను వెదుక్కున్నా. మనం, ఫ్యామిలీ కంఫర్ట్‌గా ఉండాలంటే సొంత ఇల్లు, వీలైతే ఓ ఫామ్‌హౌస్, మంచి కారు.. ఇవన్నీ చాలు అనుకున్నా. సంపాదించుకున్నా. సంతోషంగా గడిపేస్తున్నా.
పరిశ్రమలో మీకు స్నేహితులు ఎవరు?
చాలా మంది ఉన్నారు కానీ మొదటి నుంచీ రాజీవ్ కనకాలతో అనుబంధం ఉంది. అలాగే సీనియర్ నరేశ్ చాలా క్లోజ్. మంచు విష్ణు మంచి స్నేహితుడు. మోహన్‌బాబుగారు గొప్ప స్నేహితుడు. హైదరాబాద్‌లో ఉంటే ప్రతి రోజూ ఆయన్ని కలుస్తా.
మీ పిల్లల గురించి చెప్పండి
మా పెద్దబ్బాయి ఇటీవల టెన్త్ పాస్ అయ్యాడు. 81 పర్సంట్ వచ్చింది. కానీ వాడికి అది చాల్లేదు. వచ్చే ఏడాది మరిన్ని మార్కులు సంపాదించుకుందాం అని నచ్చజెప్పా.. చదువు విషయంలో తనకు ఎవరెవరు హెల్ప్ చేశారో వారందరితో ఇటీవల ఓ గెట్ టు గెదర్ నిర్వహించాం. చిన్నోడు సిక్త్స్ క్లాస్ చదువుతున్నాడు.
మీ కొత్త సినిమాలు ఏమిటి?
ఆగస్టు నుంచి మోహన్‌బాబుగారు నిర్మించే చిత్రం మొదలవుతుంది. లీడ్ రోల్ నాదే. అద్భుతమైన సబ్జెక్ట్. అది కాకుండా మరో రెండు ప్రాజెక్టులు ఉన్నాయి. రెక్కీ 2 వెబ్ సీరిస్ త్వరలో మొదలవుతుంది. ఇంకో థ్రిల్లర్ సబ్జెక్ట్ రెడీ అవుతోంది.
- వినాయకరావు