Seasonal Wellness Tips: వాతావరణ మార్పులకు ఇలా
ABN , Publish Date - May 31 , 2025 | 02:20 AM
వాతావరణ మార్పులకు అనుగుణంగా శరీరం సంరక్షణ అవసరం. పండ్లు, కూరగాయలు, మంచినీరు, వ్యాయామం, నిద్ర వంటి జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్య సమస్యలు తగ్గిస్తాయి.

సీజనల్ కేర్
ఏడాది పొడవునా వాతావరణ మార్పులు సహజం. ఈ మార్పులకు శరీరం సన్నద్ధమయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్య సమస్యలు రావు. ఆ జాగ్రత్తలు ఇవే...
వాతావరణంలో ఏర్పడే అత్యధిక, అత్యల్ప ఉష్ణోగ్రతల కారణంగా శరీరానికి నీటి అవసరం పెరుగుతూ తరుగుతూ ఉంటుంది. కాలానికి అనుగుణంగా తరచూ మంచినీరు తాగుతూ ఉంటే నీర్జలీకరణ సమస్యలనుంచి బయటపడవచ్చు.
ఎండ, వాన, చలి తీవ్రతలను దృష్టిలో ఉంచుకుని దుస్తులు ధరించాలి. వడగాలి, వర్షం, చలిగాలి బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
వాతావరణ మార్పుల వల్ల తరచూ వ్యాధులు సోకుతుంటాయి. కాలానుగుణంగా లభించే పండ్లు, కూరగాయలు, ఆకుకూరలను ఆహారంలో చేర్చుకోవాలి. అప్పుడే రోగనిరో
ధకశక్తి పెరుగుతుంది. విటమిన్లు, ప్రొటీన్లు, మినరల్స్, పీచుపదార్థాలతో కూడిన ఆహారం తీసుకోవాలి. దీనివల్ల హానికారక వైరస్‌లు, బ్యాక్టీరియాల నుంచి రక్షణ
లభిస్తుంది.
ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా క్రమం తప్పకుండా వ్యాయామం లేదా యోగ, ధ్యానం చేయాలి. వీటివల్ల శారీరక దారుఢ్యం పెరుగుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. నడక కూడా మంచిదే.
నిద్రకు ప్రాధాన్యం ఇవ్వాలి. రోజుకు కనీసం ఎనిమిది గంటలు నిద్రించడం మంచిది. స్వచ్ఛమైన గాలి, ప్రశాంతమైన పరిసరాలు, తేలికపాటి భోజనం లాంటివి నిద్ర సమస్యలను దూరం చేస్తాయి.
నీరసం, జీర్ణ సమస్యలు, దగ్గు, జలుబు, జ్వరం, విరేచనాలు, తలనొప్పి లాంటి సమస్యలు వస్తే వైద్యుని సంప్రదించాలి. తగినంత విశ్రాంతి తీసుకోవాలి.