Share News

Doctors: అరచేతుల్లో ఆరోగ్యం

ABN , Publish Date - Jul 08 , 2025 | 12:01 AM

అరచేతుల ఉష్ణోగ్రత పేగుల ఆరోగ్యాన్ని సూచిస్తుందని వైద్యులంటున్నారు..

Doctors: అరచేతుల్లో ఆరోగ్యం

రచేతుల ఉష్ణోగ్రత పేగుల ఆరోగ్యాన్ని సూచిస్తుందని వైద్యులంటున్నారు. వెచ్చని, చల్లని అరచేతులు భిన్నమైన ఆరోగ్య పరిస్థితులకు అద్దం పడతాయని వైద్యులు భావిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే..చేతుల ఉష్ణోగ్రత, శరీరంలోని రక్తప్రవాహం, శరీర వేడి నియంత్రణ సామర్థ్యం, నాడీ వ్యవస్థ సంతులనం లాంటి కీలకమైన వివరాలను అందిస్తుందని చెన్నైలోని శ్రీ బాలాజీ మెడికల్‌ సెంటర్‌ డైటీషియన్‌, దీపాలాక్షి పేర్కొంటున్నారు. పేగుల్లో నివసించే సూక్ష్మక్రిములు శరీర తాపమనాన్ని నియంత్రిస్తూ ఉంటాయి. కాబట్టి యాంటీ బయాటిక్స్‌తో ఆ సూక్ష్మజీవుల మోతాదు అస్తవ్యస్థమైనప్పుడు, ఆ ప్రభావం శరీర ఉష్ణోగ్రతను హెచ్చుతగ్గులకు లోను చేస్తోందని అంటున్నారామె. పేగుల ఆరోగ్యం, నాడీ వ్యవస్థల పనితీరు మెరుగ్గా ఉన్నప్పుడు అరచేతులు వెచ్చగా ఉంటాయి. ఒకవేళ అరచేతులు చల్లగా ఉంటే, రక్తప్రవాహం మెరుగ్గా లేదనీ, ఒత్తిడి విపరీతంగా ఉందనీ, శరీరం మెరుగ్గా పని చేయడం లేదనీ అర్థం చేసుకోవాలి. ఈ ప్రత్యక్ష లక్షణాలు పేగుల్లోని ఉపయోగకరమైన సూక్ష్మజీవుల మోతాదును కనిపెట్టడానికి పనికొస్తాయి. కాబట్టి వాటిని పెంచుకునే ఆహార నియమాలను పాటించడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని అంటున్నారామె.

Updated Date - Jul 08 , 2025 | 12:01 AM