Holi Celebrations: పండగ వేళ శ్మశానంలో..
ABN , Publish Date - Mar 10 , 2025 | 04:31 PM
Holi Celebrations: ఫాల్గుణ మాసం పౌర్ణమి ఘడియలు హోళీ పండగ జరుపుకొంటారు. ఈ పండగ వేళ.. రంగులు ఒకరిపై ఒకరు జల్లుకొంటారు. అయితే అదే హోలీ పండగ వేళ.. బూడిదను ఒకరిపై ఒకరు జల్లుకుంటారన్న సంగతి తెలుసా. అది కూడా శ్మశానంలో కాలిన భౌతిక కాయం తాలుక బూడిదను ఈ వేడుకల్లో ఒకరిపై ఒకరు జల్లుకొంటారు.

వారణాసి, మార్చి 10: మరికొద్ది రోజుల్లో దేశవ్యాప్తంగా ప్రజలు హోలీ పండగ జరుపుకోనున్నారు.హోలీ పండగ అంటే.. రకరకాల రంగులతోపాటు గులాల్ ఒకరిపై ఒకరు చల్లు కొంటారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో దాదాపుగా ఇలాగే ప్రతి ఒక్కరు ఈ పండగను జరుపుకొంటారు. అయితే హోలీ పండుగ రోజు.. శ్మశానంలో చితిపై కాలిన భౌతిక కాయం తాలుక బూడిదతో ఈ పండగ జరుపుకుంటారని తెలుసా. ఓ వేళ తెలిసినా అతి కొద్ది మందికి మాత్రమే ఈ విషయం తెలుస్తుందీ. విశ్వేశ్వరుడు కొలువు తీరిన వారణాసి క్షేత్రంలో బూడిదతో హోలీ వేడుకలు జరుపుకుంటారు.
ఈ హోలీని మసాన్‌కి హోలీ, మసాన్ హోలీ అని పిలుస్తారు. వారణాసిలోని హరిశ్చంద్ర ఘాట్‌లో మహా శ్మశాన్ హారతి అనంతరం మసాన్‌కి హోలీ ప్రారంభమవుతోంది. ఈ హోలీ వేళ.. సాధువులు, శివ భక్తులు.. పరమ శివుడిని పూజించిన అనంతరం చితి కాలిన అనంతరం వచ్చిన బూడిదతో హోలీ నిర్వహిస్తారు. ఈ సమయంలో మణికర్ణికా ఘాట్.. హరిహర్ మహాదేవ్ అనే నామ స్మరణతో మార్మోగుతోంది. అయితే చితి నుంచి వచ్చిన బూడిదతో హోలీ ఆడటం వల్ల.. శివుడుకి ఆనందం, ఆయన భక్తులకు శ్రేయస్సుతోపాటు ఆశీర్వాదం లభస్తోందని మత విశ్వాసం ఉంది. ఈ నేపథ్యంలో మసాన్ హోలీ నిర్వహిస్తారు.
Also Read: బీజేపీ ఎంపీ రిసెప్షన్ వేడుక.. అతిథులకు కీలక సూచన..
ఈ ఏడాది మసాన్ హోలీ ఎప్పుడంటే..?
2025, మార్చి 11వ తేదీ ఈ మసాన్ హోలీ జరుపుకొంటారు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో రంగభరి ఏకాదశి రోజున ఈ హోలీ పండుగ ప్రారంభమవుతుంది. ఈ రంగభరి ఏకాదశి నుంచి ఆరు రోజుల పాటు ఈ హోలీ పండగ జరుపుకుంటారు.రంగభరి ఏకాదశి రెండవ రోజున మాసాన్ హోలీ జరుపుకుంటారు. మాసాన్ హోలీ రోజు.. కాశీలోని హరిశ్చంద్ర, మణికర్ణిక ఘాట్‌లలో శివుడు తన అనుచరులతో వింత హోలీ ఆడతారనే ఓ మతపరమైన నమ్మకం ఉంది.
Also Read: శివపార్వతుల ఆశీస్సులు పొందాలంటే ఇలా చేయాలి
మాసాన్ హోలీ వెనుక ఇంత ఉందా?
వారణాసి ప్రజలకు ఈ మాసాన్ హోలీ అత్యంత ముఖ్యమైనది. ఎందుకంటే ఇది వారి సాంస్కృతిక గుర్తింపుతోపాటు ఆధ్యాత్మిక స్వభావాన్ని చూపిస్తుంది. ఈ పండగ వేళ వారణాసిలో చితిలోని బూడిదను ఉపయోగించడం ద్వారా జీవితం తాలుకు అస్థిరత, అలాగే ఈ ప్రాపంచిక జీవితంలో ఒక వ్యక్తి ఉనికి యొక్క చక్రీయ స్వభావాన్ని సూచిస్తుంది.చితి జ్వాలలు మృతుని అవశేషాలను కాల్చేస్తాయి. అలాగే భోగి మంట బూడిదతో హోలీ జనన మరణ శాశ్వత చక్రాన్ని గుర్తు చేస్తుంది.
ఇక హోలీ వేళ.. వినియోగించే శరీరం తాలుక బూడిద.. మనస్సు, ఆత్మ నుంచి కాలుష్య కారకాలను తొలగించే ప్రక్షాళన ప్రభావాలను కలిగి ఉంటుందని విశ్వసిస్తారు. వారణాసిలోని శ్మశానంలో హోలీ వేళ.. ఒకరిపై ఒకరు బూడిదను పూయడం ద్వారా ప్రజలు ఆధ్యాత్మిక ఉల్లాసంతోపాటు అంతర్గత శుద్ధీకరణ జరుగుతోందని చెబుతారు. అదే విధంగా మాసాన్ హోలీ వేడుకల్లో విభిన్న మతాల వారు పాల్గొంటారు. దీంతో స్థానిక ప్రజల్లో మత సామరస్యం, ఐక్యతను పెంపొందిస్తోంది.
For National News And Telugu News