మనిషి కాదు మృగం.. 11 ఏళ్ల బాలికను అత్యంత దారుణంగా..
ABN , Publish Date - Apr 17 , 2025 | 11:10 AM
UP Horror: మంగళవారం సాయంత్రం నుంచి ఆ బాలిక కనిపించకుండా పోయింది. బుధవారం ఉదయం బాలిక పొలాల్లో నగ్నంగా పడిపోయి కనిపించింది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ కెమెరాలను పరిశీలించి చూశారు.

రోజు రోజుకు మనుషుల్లో మానవత్వం చచ్చిపోతోంది. ముఖ్యంగా కామాంధులు రెచ్చిపోతున్నారు. చిన్న పిల్లల దగ్గరినుంచి ముసలివాళ్ల దగ్గరి వరకు ఎవరినీ వదలటం లేదు. తాజాగా, ఓ 24 ఏళ్ల వ్యక్తి 11 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మూగ, చెవిటి అయిన ఆ బాలికపై అత్యాచారం చేయటమే కాకుండా.. దారుణంగా కొట్టి హింసించాడు. పట్టుకోవడానికి వెళ్లిన పోలీసులపై తుపాకితో కాల్పులు జరిపాడు. పోలీసులు అతడి తొడలో బుల్లెట్ దింపి బుద్ధి చెప్పారు. స్టేషన్‌కు ఈడ్చుకెళ్లారు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు, బాధితురాలి కుటుంబం చెప్పిన వివరాల మేరకు..
ఉత్తర ప్రదేశ్, రామ్‌పూర్ జిల్లాకు చెందిన 11 ఏళ్ల బాలిక చెవిటి, మూగ సమస్యతో బాధపడుతూ ఉంది. మంగళవారం సాయంత్రం నుంచి ఆ బాలిక కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యులు బాలికకోసం వెతుకుతూ ఉన్నారు. బుధవారం ఉదయం బాలిక పొలాల్లో నగ్నంగా పడిపోయి కనిపించింది. పాప శరీరంపై గాయాలు కూడా ఉన్నాయి. కుటుంబసభ్యులు వెంటనే బాలికను ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అందించిన అక్కడి డాక్టర్లు.. మెరుగైన వైద్యం కోసం మీరట్ తీసుకెళ్లమని సలహా ఇచ్చారు. డాక్టర్ల సలహా మేరకు కుటుంబసభ్యులు బాలికను మీరట్ తీసుకెళ్లారు. పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ కెమెరాలను పరిశీలించి చూశారు. అదే గ్రామానికి చెందిన డాన్ సింగ్ అనే 24 ఏళ్ల యువకుడిపై అనుమానం మొదలైంది. అతడ్ని పట్టుకోవడానికి ప్రయత్నించగా.. తుపాకితో పోలీసులపై కాల్పులు జరిపాడు. ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. డాన్ సింగ్ తొడలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. అతడు పోలీసులకు దొరికిపోయాడు. అతడ్ని ఆస్పత్రికి తరలించారు. చికిత్స తర్వాత స్టేషన్ తీసుకెళ్లనున్నారు. ఇక, బాలిక పరిస్థితిపై డాక్టర్ అంజు సింగ్ మాట్లాడుతూ.. ‘ ఒకరు లేదా అంతకంటే ఎక్కువమంది ఆమెపై అత్యాచారం చేశారు. పదునైన ఆయుధంతో ఆమె ముఖంపై కొట్టారు. దారుణంగా హింసించారు. ఏం జరిగిందో బాలిక చెప్పలేకపోతోంది’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి
ఆ ఒక్క విటమిన్ లోపం.. మీ వైవాహిక జీవితం నాశనం.. చేస్తుంది..
కథలో ట్విస్టులు.. అందుకే కూతురికి కాబోయే భర్తతో జంప్..