Share News

Most Wanted Gangsters: మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్స్‌ అరెస్ట్.. త్వరలో విదేశాల నుంచి ఇండియాకు..

ABN , Publish Date - Nov 09 , 2025 | 01:39 PM

ఇండియాకు చెందిన మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్స్ ఇద్దరు విదేశాల్లో అరెస్ట్ అయ్యారు. ఒకరు జార్జియాలో అరెస్ట్ కాగా.. మరొకరు అమెరికాలో అరెస్ట్ అయ్యారు. సెక్యూరిటీ ఏజెన్సీ అధికారులు త్వరలో వీరిని ఇండియాకు తీసుకురానున్నారు.

Most Wanted Gangsters: మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్స్‌ అరెస్ట్.. త్వరలో విదేశాల నుంచి ఇండియాకు..
Most Wanted Gangsters

న్యూఢిల్లీ: విదేశాల్లో ఉంటూ ఇండియాలో నేర కార్యకలాపాలు సాగిస్తున్న ఇద్దరు మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్స్‌ను ఇండియన్ సెక్యూరిటీ ఏజెన్సీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ ఆపరేషన్‌లో సెక్యూరిటీ ఏజెన్సీ అధికారులతో పాటు హర్యానా పోలీస్ శాఖకు చెందిన పోలీసులు కూడా పాల్గొన్నారు. మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్‌లో ఒకడైన వెంకటేష్ గార్గ్‌ను జార్జియాలో అరెస్ట్ చేశారు. మరో గ్యాంగ్‌స్టర్ భాను రానాను యునైటెడ్ స్టేట్స్‌లో అదుపులోకి తీసుకున్నారు. అత్యంత ప్రమాదకరమైన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో భాను రానాకు సంబంధాలు ఉండటం గమనార్హం.


ఈ ఇద్దరినీ అతి త్వరలో విదేశాలనుంచి ఇండియాకు తీసుకురానున్నారు. కాగా, ఇండియాకు చెందిన 12 మందికి పైగా గ్యాంగ్‌స్టర్స్ విదేశాల్లో ఉంటున్నారు. అక్కడినుంచి ఇండియాలో తమ నేర కార్యకలాపాలను సాగిస్తున్నారు. కిమినల్స్‌ను పనిలో పెట్టుకుని సిండికేట్ నడుపుతున్నారు. వెంకటేష్ గార్గ్, భాను రానాల అరెస్ట్‌తో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. విచారణలో విస్తుపోయే విషయాలు బయటపెడుతున్నారు.


గ్యాంగ్‌స్టర్స్ నేర చరిత్ర ఇదీ..

వెంకటేష్ హర్యానాలో జన్మించాడు. అతడిపై ఇండియాలో 10కి పైగా కేసులు ఉన్నాయి. బహుజన్ సమాజ్ పార్టీ నేత హత్య తర్వాత జార్జియా పారిపోయాడు. అక్కడినుంచి ఇండియాలో తన నేర కార్యకలాపాలు సాగిస్తున్నాడు. హర్యానా, రాజస్తాన్, ఢిల్లీతో పాటు ఉత్తర భారతదేశంలోని మిగిలిన రాష్ట్రాలనుంచి క్రిమినల్స్‌ను పనిలో పెట్టుకున్నాడు. వారి సాయంతో ఇండియాలో నేరాలకు పాల్పడుతున్నాడు. ఇక, భాను రానా విషయానికి వస్తే.. రానాకు బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధాలు ఉన్నాయి. కర్నల్ ప్రాంతానికి చెందిన రానాపై కూడా పెద్ద సంఖ్యలో కేసులు ఉన్నాయి. హర్యానా, పంజాబ్, ఢిల్లీ ప్రాంతాల్లో ఇతడు నేర కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు. పంజాబ్‌లో గ్రెనేడ్ దాడి జరిగిన సమయంలో రానా పేరు దేశ వ్యాప్తంగా తెగ చక్కర్లు కొట్టింది.


ఇవి కూడా చదవండి

తోటకూర వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా..

అటు ఆధ్యాత్మికం... ఇటు పర్యాటకం... ఎక్కడంటే...

Updated Date - Nov 09 , 2025 | 01:40 PM