Share News

Thailand: థాయ్‌లాండ్‌ ప్రధానిపై సస్పెన్షన్‌ వేటు

ABN , Publish Date - Jul 02 , 2025 | 06:08 AM

ఫోన్‌కాల్‌ లీకైన వ్యవహారంలో థాయ్‌లాండ్‌ ప్రధాని పేటోంగ్టార్న్‌ షినవత్రాపై సస్పెన్షన్‌ వేటు పడింది. షినవత్రాను విధుల నుంచి బహిష్కరిస్తూ..

Thailand: థాయ్‌లాండ్‌ ప్రధానిపై సస్పెన్షన్‌ వేటు

బ్యాంకాక్‌, జూలై 1: ఫోన్‌కాల్‌ లీకైన వ్యవహారంలో థాయ్‌లాండ్‌ ప్రధాని పేటోంగ్టార్న్‌ షినవత్రాపై సస్పెన్షన్‌ వేటు పడింది. షినవత్రాను విధుల నుంచి బహిష్కరిస్తూ.. ఆ దేశ రాజ్యాంగ న్యాయస్థానం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. దేశ భద్రతకు సంబంధించిన విషయాలను పొరుగుదేశం కాంబోడియా మాజీ ప్రధాని హున్‌సేన్‌తో ఆమె చర్చించడంపై దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపింది.


వీరి సంభాషణ లీక్‌ కావడంతో.. ఆమె రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని, నైతిక ప్రమాణాలు పాటించలేదని ఆరోపిస్తూ పదవి నుంచి తొలగించాలని పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ జరిపిన న్యాయస్థానం... 7-2 మెజార్టీతో ఆమెను విధుల నుంచి సస్పెండ్‌ చేస్తూ తీర్పునిచ్చింది. రాజ్యాంగ తీర్పును సవాల్‌ చేస్తూ మరో 15 రోజుల్లోగా షినవత్రా తన వాదనలను వినిపించుకోవాల్సి ఉంటుంది.

Updated Date - Jul 02 , 2025 | 06:08 AM