Pahalgam Attack: 20 గంటల పాటు ఉగ్రవాదుల ట్రెక్కింగ్
ABN , Publish Date - Apr 27 , 2025 | 10:02 PM
ఏప్రిల్ 22 పహల్గాం ఉగ్రదాడి దర్యాప్తు ఎన్ఐఏకు అప్పగించిన దగ్గర్నుంచి ఈ దాడి దర్యాప్తు కొత్తపుంతలు తొక్కుతోంది. ఇప్పటికే కశ్మీర్ లో ఉగ్రమూకల్ని జల్లెడపడుతుంటే, మరోపక్క..

Pahalgam Aftermath: ఏప్రిల్ 22 పహల్గాం ఉగ్రదాడి దర్యాప్తు ఎన్ఐఏకు అప్పగించిన దగ్గర్నుంచి ఈ దాడి దర్యాప్తు కొత్తపుంతలు తొక్కుతోంది. ఇప్పటికే కశ్మీర్ లో ఉగ్రమూకల్ని జల్లెడపడుతుంటే, మరోపక్క ఒక యూట్యూబ్ రీల్స్ తయారు చేసే ఒక ఫొటోగ్రాఫర్ నుంచి దాడికి సంబంధించిన పూర్తి ఆధారాలు కలిగిన పూర్తి వీడియో ఫుటేజ్ ఎన్ఐఏ సంపాదించింది. అంతేకాదు, తాజాగా ఈ దాడి చేసేందుకు నలుగురు ఉగ్రమూక దాదాపు 18 గంటల పాటు కొండల్లో ట్రెకింగ్ చేసినట్టు తెలిసొస్తోంది.
పర్యాటకులను చంపేందుకు టెర్రిరిస్టులు పెద్ద ప్లాన్ ముందుగా వేసుకుని తదనుగుణంగా తమ ప్లాన్ అమలు చేసినట్టు ఎన్ఐఏ వర్గాలకి కీలక ఆధారాలు దొరికాయి. ఉగ్రమూక పహల్గాంకు చేరుకునేందుకు దాదాపు 18 గంటల పాటు ట్రెక్కింగ్ చేసినట్లు దర్యాప్తులో తేలిందని సమాచారం. ఈ ఉగ్రమూక కోకెర్నాగ్ అడవుల నుంచి బైసరన్ లోయ వరకు ట్రెకింగ్ చేసుకుంటూ వచ్చినట్లు తెలుస్తోంది. దాడి సమయంలో ఉగ్రవాదులు ఒక స్థానికుడు, పర్యాటకుడి నుంచి రెండు మొబైల్ ఫోన్లు దొంగలించినట్లు కూడా తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి
స్కూలు బాలికలతో తప్పుడు ప్రవర్తన.. చావగొట్టిన జనం..
Nani: బాలీవుడ్ చిత్ర పరిశ్రమపై కీలక వ్యాఖ్యలు చేసిన హీరో నాని