Share News

Pavel Durov: వీర్యదానంతో పుట్టిన 100మందికి ఆస్తి పంచేస్తా

ABN , Publish Date - Jun 21 , 2025 | 06:15 AM

తన వీర్యదానంతో ప్రపంచవ్యాప్తంగా 12 దేశాల్లో 100 మంది జన్మించారంటూ సంచలన ప్రకటన చేసిన ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ టెలిగ్రామ్‌ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో పావెల్‌ దురోవ్‌ మరో సంచలన ప్రకటన చేశారు.

Pavel Durov: వీర్యదానంతో పుట్టిన 100మందికి ఆస్తి పంచేస్తా

  • టెలిగ్రామ్‌ సీఈవో పావెల్‌ దురోవ్‌ ప్రకటన

న్యూఢిల్లీ, జూన్‌ 20: తన వీర్యదానంతో ప్రపంచవ్యాప్తంగా 12 దేశాల్లో 100 మంది జన్మించారంటూ సంచలన ప్రకటన చేసిన ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ టెలిగ్రామ్‌ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో పావెల్‌ దురోవ్‌ మరో సంచలన ప్రకటన చేశారు. ఆ పిల్లలందరికీ కూడా తన సంపద 13.9 బిలియన్‌ డాలర్లను సమానంగా పంచుతానని ప్రకటించారు. ఈ మేరకు తాను ఇటీవలే వీలునామా కూడా రాసినట్లు పావెల్‌ చెప్పారు. పావెల్‌ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆయనకు వివాహం కాకున్నా ముగ్గురు మహిళలతో సహజీవనం చేస్తున్నారు. వారితో ఆయనకు ఆరుగురు పిల్లలు కలిగారు.


ఈ ఆరుగురితో పాటు వీర్యదానం ద్వారా జన్మించిన 100 మంది పిల్లలకు కూడా తాను తండ్రినని.. తనకు అందరూ సమానమేనని, ఎవ్వరిపట్లా వివక్ష ఉండదని స్పష్టంచేశారు. అందుకే తన ఆస్తిలో వారందరికీ సమాన వాటా ఉంటుందని పావెల్‌ చెప్పారు. తన జీవితం ఎన్నో సవాళ్లతో ముడిపడి ఉన్నదని, అందుకే 40 ఏళ్ల వయసులోనే వీలునామా రాసినట్లు వెల్లడించారు. అయితే పావెల్‌ ఆస్తి అంతా రాత్రికి రాత్రే పిల్లలకు చెందదు! వీలునామా రాసిన రోజు నుంచి 30 ఏళ్లు దాటాకే.. అంటే 2055 జూన్‌ 19 తర్వాతే ఆస్తి పిల్లలకు చెందుతుంది.

Updated Date - Jun 21 , 2025 | 06:15 AM