Share News

Teen Girl: బై ఎలక్షన్‌లో గెలుపు.. విజయోత్సాహంతో ప్రత్యర్థుల ఇళ్లపై బాంబుల దాడి

ABN , Publish Date - Jun 23 , 2025 | 04:56 PM

Teen Girl: ఓ నాటు బాంబు తమన్నా ఖాతూన్ అనే బాలిక దగ్గర పేలింది. దీంతో బాలిక తీవ్రంగా గాయపడి చనిపోయింది. ఈ సంఘటనపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. ఈ మేరకు ట్విటర్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు.

Teen Girl: బై ఎలక్షన్‌లో గెలుపు.. విజయోత్సాహంతో ప్రత్యర్థుల ఇళ్లపై బాంబుల దాడి
Teen Girl

పశ్చిమ బెంగాల్‌లో దారుణం చోటుచేసుకుంది. బై ఎలక్షన్‌లో తృణముల్ కాంగ్రెస్ పార్టీ విజయం ఓ బాలిక ప్రాణం బలి తీసుకుంది. ఆ పార్టీ కార్యకర్తల బాంబు దాడిలో పాప తీవ్రగాయాలపాలై చనిపోయింది. ఓ ప్రముఖ జాతీయ మీడియా కథనం ప్రకారం.. పశ్చిమ బెంగాల్, నదియా జిల్లా, కాళీగంజ్ నియోజకవర్గానికి కొన్ని రోజుల క్రితం బై ఎలక్షన్ జరిగింది. ఈ రోజు ఓట్ల లెక్కింపు జరిగింది. కాళీగంజ్ బై ఎలక్షన్లో అధికార తృణముల్ పార్టీ విజయం సాధించింది. బై ఎలక్షన్‌లో విజయంతో ఆ పార్టీ కార్యకర్తలు రెచ్చిపోయారు.


సీపీఎమ్ పార్టీ మద్దతుదారుల ఇళ్లపై నాటు బాంబులు విసిరారు. ఈ నేపథ్యంలోనే ఓ నాటు బాంబు తమన్నా ఖాతూన్ అనే బాలిక దగ్గర పేలింది. దీంతో బాలిక తీవ్రంగా గాయపడి చనిపోయింది. ఈ సంఘటనపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. ఈ మేరకు ట్విటర్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో..‘బారోచంద్ నగర్‌లో సంభవించిన పేలుడులో బాలిక చనిపోయిందని తెలిసి షాక్ అయ్యాను. ఈ విషాద సమయంలో నా ఆలోచనలన్నీ బాలిక కుటుంబంతోటే ఉన్నాయి.


పోలీసులు వీలైనంత త్వరగా నేరం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి’ అని పేర్కొన్నారు. కాగా, కాళీగంజ్‌ సిట్టింగ్ ఎమ్మెల్యే నశిరుద్దీన్ అహ్మద్ మరణంతో బై ఎలక్షన్ జరిగింది. ఈ బై ఎలక్షన్‌లో తృణముల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అలిఫా అహ్మద్ గెలుపొందారు. బీజేపీ తరపున ఆశిష్ ఘోష్, కాంగ్రెస్ తరపున కాబిల్ ఉద్దిన్ నిలబడ్డారు. ఈ బై ఎలక్షన్‌లో బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. బీజేపీపై అలిఫా 50 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ గెలుపుపై మమతా బెనర్జీ సంతోషం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా నియోజకవర్గ ప్రజలకు కృతజ్ణతలు తెలియజేశారు.


ఇవి కూడా చదవండి

రైలులో ఎమ్మెల్యే దౌర్జన్యం.. సీటు మార్చుకోలేదని..

హైదరాబాద్‌లో దంచి కొట్టిన వర్షం

Updated Date - Jun 23 , 2025 | 05:03 PM