Ponmudy: హిందూ మహిళలపై మంత్రి వెకిలి వ్యాఖ్యలు.. మంత్రి పదవి నుంచి తొలగింపు
ABN , Publish Date - Apr 11 , 2025 | 03:54 PM
తమిళనాడు అటవీశాఖ మంత్రి పొన్ముడి.. హిందూ మహిళలనుద్దేశించి దారుణమైన వ్యాఖ్యలు చేశారు. హిందూ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను ఆయన్ను సీఎం స్టాలిన్ మంత్రి పదవి నుంచి తొలగించారు.

Tamil Nadu minister Ponmudy: తమిళనాడు అటవీశాఖ మంత్రి పొన్ముడి.. హిందూ మహిళలనుద్దేశించి దారుణమైన వ్యాఖ్యలు చేశారు. హిందూ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను ఆయన్ను సీఎం స్టాలిన్ మంత్రి పదవి నుంచి తొలగించారు. ఒక బహిరంగ కార్యక్రమంలో మహిళలు, శైవులు, వైష్ణవుల గురించి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినందుకు తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో తమిళనాడు మంత్రి కె పొన్ముడిని శుక్రవారం అధికార ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) పార్టీ.. పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ పదవి నుండి కూడా తొలగించింది.
పొన్ముడి చేసిన వ్యాఖ్యలపై తమిళనాట తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సినీ తారల దగ్గర్నుంచి అధికార పార్టీ సభ్యులు కూడా ఆయన వైఖరిపై మండిపడుతున్నారు. DMK ఎంపీ K కనిమొళి కూడా పొన్ముడి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. “ పొన్ముడి ఇటీవలి ప్రసంగం ఆమోదయోగ్యం కాదు. దానికి కారణం ఏదైనా, ఇటువంటి అసభ్యకరమైన వ్యాఖ్యలు ఖండించదగినవి,” అని కనిమొళి X(సామాజిక మాధ్యమం)లో పేర్కొంది. కాగా, ఒక బహిరంగ కార్యక్రమానికి హాజరైన మంత్రి పొన్ముడి హిందూ మహిళలు నుదుట ధరించే తిలకాలను ప్రైవేట్ పార్ట్స్‌తో పోల్చాడు. దీంతో తమిళనాట అందరూ పార్టీలకతీతంగా విరుచుకుపడుతున్నారు. ఈ ఘటన హిందూ విశ్వాసాలపై దాడిగా బీజేపీ అభివర్ణించింది.
డిఎంకె ప్రభుత్వంలోని అత్యంత సీనియర్ మంత్రులలో పొన్ముడి ఒకరు. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద 2023లో పొన్ముడిని, ఆయన కుమారుడు, కళ్లకురిచ్చి పార్లమెంటు సభ్యుడు గౌతమ్ సిగమ్నైని ఇంకా వారి కుటుంబ సభ్యులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) ప్రశ్నించింది. ఈ కేసులో ED ₹14 కోట్లకు పైగా విలువైన ఆస్తులను జప్తు చేసింది.మార్చి 2024లో, సుప్రీంకోర్టు పొన్ముడిని దోషిగా నిర్ధారించి, నాలుగు సంవత్సరాల జైలు శిక్ష విధించి, స్టాలిన్ మంత్రివర్గంలోకి తిరిగి చేర్చుకోవడానికి అనుమతించింది. మద్రాస్ హైకోర్టు 2023లో ఆయనను దోషిగా నిర్ధారించింది, దీని ఫలితంగా ఆయన వెంటనే శాసనసభ్యుడిగా అనర్హత వేటు పడడంతో అప్పట్లో మంత్రి పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్లీ ఇలాంటి మాటలతో మంత్రి పదవి పోగొట్టుకున్నారు పొన్ముడి.
ఇవి కూడా చదవండి:
Viral Videos: బట్టలు కుడుతున్న ట్రంప్, ఫోన్ల పరిశ్రమలో ఎలాన్ మస్క్..నెట్టింట వీడియోలు వైరల్
SVPNPA Job Openings: హైదరాబాద్ పోలీస్ అకాడమీలో డ్రీమ్ జాబ్స్..మీకు అర్హత ఉందా, అప్లై చేశారా
Stock Market Rally: లాభాల్లో దూసుకెళ్తున్న స్టాక్ మార్కెట్లు..సెన్సెక్స్ 1,140 పాయింట్లు జంప్
EPFO: పీఎఫ్ ఉద్యోగులకు అలర్ట్..మరింత ఈజీగా UAN నంబర్ పొందే ఛాన్స్..
Read More Business News and Latest Telugu News