Share News

Protest For Roads: గ్రామంలో రోడ్లు లేవంటూ సోషల్ మీడియాలో గర్భిణుల నిరసన.. ఎంపీ రెస్పాన్స్ చూస్తే..

ABN , Publish Date - Jul 12 , 2025 | 10:02 AM

తమ గ్రామంలో రోడ్లు లేవంటూ ఓ గర్భిణులు నెట్టింట తెలిపిన నిరసనలకు స్థానిక ఎంపీ జవాబిచ్చిన తీరుపై విమర్శలు చెలరేగుతున్నాయి.

Protest For Roads: గ్రామంలో రోడ్లు లేవంటూ సోషల్ మీడియాలో గర్భిణుల నిరసన.. ఎంపీ రెస్పాన్స్ చూస్తే..
Sidhi Road Protest

ఇంటర్నెట్ డెస్క్: ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ఠగా నిలిచే ఓ షాకింగ్ ఉదంతం మధ్యప్రదేశ్‌లో వెలుగు చూసింది. తమ గ్రామంలో రోడ్లు సరిగా లేక ఇబ్బందులు పడుతున్నామంటూ కొందరు గర్భిణులు సోషల్ మీడియాలో ఫిర్యాదు చేస్తే స్థానిక ఎంపీ ఊహించని సమాధానం ఇచ్చారు. ఖుర్ద్ గ్రామంలో జరిగిన ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే..

లీలా సాహు అనే మహిళకు ఇన్‌స్టాలో లక్షకు పైచిలుకు ఫాలోవర్లు ఉన్నారు. అయితే, ఆ గ్రామంలో రోడ్లు సరిగా లేక గర్భిణులు తెగ ఇబ్బంది పడ్డారు. ఈ క్రమంలో కొందరు మహిళలతో కలిసి లీలా సాహూ 2023లో ఓ వీడియో చేసి ప్రధాని, కేంద్ర మంత్రులను ట్యాగ్ చేస్తూ పోస్టు పెట్టారు. ‘మధ్యప్రదేశ్ నుంచి 29 మంది ఎంపీలు అయ్యారు. ఇకనైనా మా గ్రామంలో రోడ్లు వస్తాయా’ అని ప్రశ్నించారు. ఈ వీడియో విపరీతంగా వైరల్ కావడంతో జిల్లా కలెక్టర్, స్థానిక ఎంపీ స్పందించారు. తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇది జరిగి ఏడాది దాటిపోయినా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. గ్రామస్థుల సమస్యలు పరిష్కారం కాలేదు. అక్కడి రోడ్ల పరిస్థితి అలాగే ఉండిపోయింది. గుంతల మయమైన రోడ్లపై నడవలేక జనాలు, ముఖ్యంగా గర్భిణులు ఇక్కట్ల పాలవుతున్నారు.


ఈ ఘటనపై స్పందించిన ఎంపీ రాజేశ్ మిశ్రా పలు కామెంట్స్ చేశారు. ‘ప్రతి డెలివరీకి ఓ డేట్ ఉంటుంది. ఆ డేట్‌కు వారం మునుపే రోడ్డును నిర్మిస్తాము. ఆమెకు అక్కడ ఇబ్బందిగా ఉండే ఇక్కడ ఆసుపత్రిలో అన్ని ఏర్పాట్లు చేస్తాము. అంతేకానీ.. రోడ్ల గురించి ఇలా బహిరంగంగా మాట్లాడటం సబబు కాదు’ అని అన్నారు. రోడ్ల కారణంగా గర్భిణులకు ఇబ్బందులు ఎదురైన ఘటన అక్కడ ఎప్పుడూ వెలుగులోకి రాలేదని అన్నారు. హెలికాఫ్టర్స్, ఎయిరోప్లేన్లు, ఆశా వర్కులు, అంబులెన్సులు అన్నీ అందుబాటులో ఉండగా టెన్షన్ ఎందుకని ప్రశ్నించారు. అటవీ శాఖ అభ్యంతరాల కారణంగా రోడ్డు వేయడంలో జాప్యం జరుగుతోందని చెప్పారు.


అంతకుముందు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ మంత్రి రాకేశ్ సింగ్‌ కూడా స్పందించారు. ‘సోషల్ మీడియాలో పోస్టులు పెడితే డంపర్, సిమెంట్ కాంక్రీట్ ప్లాంట్‌తో అక్కడికి వెళ్లిపోతామా? అది సాధ్యం కాదు కదా’ అని వ్యాఖ్యానించారు. బడ్జెట్‌లకు పరిమితులు ఉన్నాయని, ఆన్‌లైన్‌లో చేసిన ప్రతి డిమాండ్‌ను అప్పటికప్పుడు పరిష్కరించడం సాధ్యం కాదని అన్నారు. ప్రతి దానికీ రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ ఒకటి ఉంటుందని, ఇక గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం స్థానిక ప్రభుత్వ సంస్థల బాధ్యత అని అన్నారు. ప్రతి పోస్టుపై స్పందించలేమని చెప్పారు.


ఇవి కూడా చదవండి:

ఒక్క రోజు కూడా పని చేయని కానిస్టేబుల్‌కు రూ.28 లక్షల జీతం

తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో పోలీస్ అకాడమీలో చేరి.. రెండేళ్ల పాటు..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 12 , 2025 | 10:24 AM