Share News

Shubhanshu Shukla: అమ్మో.. బెంగళూరు ట్రాఫిక్.. వ్యోమగామి శుభాన్షూ శుక్లా సెటైర్లు

ABN , Publish Date - Nov 21 , 2025 | 10:53 AM

బెంగళూరు ట్రాఫిక్ కష్టాలపై వ్యోమగామి శుభాన్షూ శుక్లా సెటైర్లు పేల్చారు. బెంగళూరు టెక్ సమ్మిట్‌లో పాల్గొన్న ఆయన.. తన ప్రసంగం కంటే ఎక్కువ సమయం ట్రాఫిక్‌లో జర్నీ చేయాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు.

Shubhanshu Shukla: అమ్మో.. బెంగళూరు ట్రాఫిక్.. వ్యోమగామి శుభాన్షూ శుక్లా సెటైర్లు
Shubhanshu Shukla comments

ఇంటర్నెట్ డెస్క్: బెంగళూరు ట్రాఫిక్‌లో జర్నీ ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బెంగళూరు అంటేనే జనాలు వణికిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వ్యోమగామి, ఎయిర్‌ఫోర్స్ పైలట్ శుభాన్షూ శుక్లా కూడా నగర ట్రాఫిక్‌పై సెటైర్లు పేల్చారు (Shubhanshu Shukla on Bengaluru Traffic).

బెంగళూరు టెక్ సమ్మిట్‌లో గురువారం ప్రసంగించిన శుభాన్షూ శుక్లా బెంగళూరు ట్రాఫిక్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మారతహళ్లి నుంచి ఇక్కడకు వచ్చేందుకు చాలా సమయం పట్టింది. నా ప్రసంగం కంటే మూడు రెట్లు ఎక్కువ సమయం పట్టింది. దీన్ని బట్టి నా నిబద్ధత ఎంతటిదో మీరు అర్థం చేసుకోవాలి’ అంటూ సరదా కామెంట్స్ చేశారు.


ఈ కామెంట్స్‌పై రాష్ట్ర ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే కూడా స్పందించారు. ఫ్యూచర్స్ కాన్‌క్లేవ్ సమావేశంలో మాట్లాడిన ఆయన ట్రాఫిక్ సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. ‘బెంగళూరు నగరంలో 30 కిలోమీటర్ల జర్నీ కంటే అంతరిక్షం నుంచి భూమ్మీదకు రావడం తనకు కాస్త సులువుగా ఉందని శుభాన్షూ అన్నారు. అయితే, ఈ సమస్య పరిష్కారానికి మేము చర్యలు తీసుకుంటాము’ అని మంత్రి పేర్కొన్నారు.

ఇక బెంగళూరు ట్రాఫిక్ కష్టాలకు వాహనాలు అకస్మాత్తుగా బ్రేక్ డౌన్ కావడం ఓ ప్రధాన కారణమని ఓ నిపుణులు చెబుతున్నారు. ఇందులో బీఎమ్‌టీసీ బస్సుల వాటానే 40 శాతంగా ఉంటుందని పేర్కొన్నారు. సోమవారం నగరంలో జరిగిన ‘బిల్డింగ్ అండ్ మేనేజింగ్ అర్బన్ ట్రాన్స్‌పోర్టు నెట్‌వర్క్స్’ సమావేశంలో ఈ కామెంట్స్ చేశారు. అన్ని వర్గాలను భాగస్వాములను చేస్తూ సేకరించిన గణాంకాల ఆధారంగా నగర రవాణా వ్యవస్థల డిజైనింగ్ జరగాలని నిపుణులు పేర్కొన్నారు. ప్రస్తుతం నెలకొల్పుతున్న కొన్ని ప్రాజెక్టులు కూడా సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు


ఇవి కూడా చదవండి...

తాజ్‌మహల్‌ను సందర్శించిన ట్రంప్ జూనియర్

మనీలాండరింగ్ కేసులో అల్ ఫలాహ్ యూనివర్సిటీ వ్యవస్థాపకుడి అరెస్టు

Read Latest National News And Telugu News

Updated Date - Nov 21 , 2025 | 03:32 PM