Share News

Sardar Fauja Singh: 100 ఏళ్ల వయసులో రికార్డులు.. 114 ఏళ్ల వయసులో అనుకోని విషాదం..

ABN , Publish Date - Jul 15 , 2025 | 07:59 AM

Sardar Fauja Singh: సర్ధార్ ఫౌజీ సింగ్ 89 ఏళ్ల వయసులో మారథాన్ రన్నింగ్ చేయటం మొదలెట్టారు. 100 ఏళ్ల వయసులోనూ మారథాన్ రన్నింగ్ చేశారు. పూర్తి స్థాయిలో మారథాన్ రన్నింగ్ చేసిన వయో వృద్ధుడిగా రికార్డు సాధించారు.

Sardar Fauja Singh: 100 ఏళ్ల వయసులో రికార్డులు.. 114 ఏళ్ల వయసులో అనుకోని విషాదం..
Sardar Fauja Singh

వయసు పెరిగే కొద్దీ శరీరం సహకరించటం మొల్లిమెల్లిగా తగ్గుతుంది. ఓ వయసు వచ్చాక సరిగా నడవటమే కష్టంగా మారుతుంది. ఇక, వందేళ్లు దాటితే మనిషి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. వందేళ్లు దాటి బతకటం అన్నది అత్యంత అరుదుగా జరుగుతూ ఉంటుంది. అలాంటి కేసుల్లో చాలా మంది మంచానికే పరిమితం అవుతూ ఉంటారు. కానీ, పంజాబ్‌కు చెందిన ఫౌజా సింగ్ మాత్రం 114 ఏళ్ల వయసులోనూ ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు. నడవటం కాదు.. మారథాన్ రన్నింగులు చేసేవారు.


అలాంటి ఆయన ఊహించని విధంగా కన్నుమూశారు. ఓ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకున్నారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. జలంధర్‌లోని బియాస్ గ్రామానికి చెందిన సర్ధార్ ఫౌజీ సింగ్ 89 ఏళ్ల వయసులో మారథాన్ రన్నింగ్ చేయటం మొదలెట్టారు. 100 ఏళ్ల వయసులోనూ మారథాన్ రన్నింగ్ చేశారు. పూర్తి స్థాయిలో మారథాన్ రన్నింగ్ చేసిన వయో వృద్ధుడిగా రికార్డు సాధించారు. పలు క్యాటగిరీల్లో వరల్డ్ రికార్డులు సొంతం చేసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు.


114 ఏళ్ల వయసులోనూ ఎంత ఆరోగ్యంగా ఉన్నారు. ఎంతో చురుగ్గా ఊర్లో తిరుగుతూ ఉన్నారు. అలాంటి ఆయన అనుకోని ప్రమాదానికి గురయ్యారు. సోమవారం మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో రోడ్డు దాటుతూ ఉండగా గుర్తు తెలియని వాహనం ఆయన్ని ఢీకొంది. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఫౌజీ సింగ్ మరణంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. రాజకీయ ప్రముఖులు సైతం పెద్దాయన మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

పాడుబడ్డ ఇంట్లో అస్తి పంజరం..

మరికొన్ని గంటల్లో ఉరి.. అద్భుతం జరుగుతుందా?.

Updated Date - Jul 15 , 2025 | 08:07 AM