Share News

కూలీకి షాక్ ఇచ్చిన ఇన్‌కమ్‌టాక్స్ డిపార్ట్‌మెంట్.. 314 కోట్ల ట్యాక్స్..

ABN , Publish Date - Apr 10 , 2025 | 11:59 AM

Tax Notice To Labourer: మధ్య ప్రదేశ్, బెతుల్ జిల్లాకు చెందిన చంద్రశేఖర్‌కు 314 కోట్ల 79 లక్షల, 87 వేల రూపాయలు కట్టాలంటూ ఆదాయ పన్ను శాఖ నోటీసు పంపింది. దీంతో అతడి కుటుంబం మొత్తం రోడ్డున పడింది. ఓ పొరపాటు కారణంగా అలా జరిగినట్లు తేలింది.

కూలీకి షాక్ ఇచ్చిన ఇన్‌కమ్‌టాక్స్ డిపార్ట్‌మెంట్.. 314 కోట్ల ట్యాక్స్..
Tax Notice To Labourer

ఆదాయ పన్ను శాఖ గురించి మీకు తెలిసే ఉంటుంది. టాక్స్ స్లాబుల ప్రకారం.. మనం సంపాదించే దానిపై పన్నులు వసూలు చేస్తూ ఉంటుంది. 3 లక్షల కంటే ఎక్కువ సంపాదించే వారు కచ్చితంగా ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. ఒక వేళ ట్యాక్స్ కట్టకపోతే ఆదాయ పన్ను శాఖ వారికి నోటీసులు పంపిస్తుంది. అయితే, ఆదాయ పన్ను శాఖ చేసిన ఓ తప్పు వల్ల ఓ నిరుపేద షాక్ అయ్యాడు. పనికి వెళితే గానీ,రోజు గడవని అతడికి 314 కోట్ల పన్ను కట్టాలంటూ నోటీసులు పంపింది. ఆ నోటీసులు చూసి అతడు నెత్తి నోరు బాదుకుంటున్నాడు. నోటీసులు దెబ్బకు అతడి కుటుంబం రోడ్డున పడింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఆలస్యంగా వెలుగు చూసింది. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


మధ్య ప్రదేశ్, బెతుల్ జిల్లాకు చెందిన చంద్రశేఖర్ పండిత్ రావు కోహద్ దినసరి కూలీగా పని చేసుకుని జీవితం సాగిస్తున్నాడు. అద్దె ఇంట్లో ఉంటున్నాడు. అతడి రోజు సంపాదన 200 నుంచి 300 రూపాయలు ఉంటుంది. ప్రతి రోజూ కూలీకి పోతే గానీ అతడి ఇళ్లు గడవదు. అలాంటి అతడికి ఆదాయ పన్ను శాఖ నుంచి నోటీసులు వచ్చాయి. అది కూడా 314 కోట్ల 79 లక్షల, 87 వేల రూపాయలు కట్టాలంటూ ఆ నోటీసుల్లో ఉంది. ఆ నోటీసులో ఉన్నది ఏంటో తెలియగానే అతడు షాక్ అయ్యాడు. తాను జీవితాంతం కష్టపడ్డా కోటి రూపాయలు సంపాదించలేను.. అలాంటిది అంత పన్ను కట్టమని నోటీసు రావటం ఏంటి అనుకుని బాధలో మునిగిపోయాడు. నోటీసుల దెబ్బకు కుటుంబం మొత్తం ట్రోమాలోకి వెళ్లిపోయింది.


ఒకరి తర్వాత ఒకరు అనారోగ్యం బారిన పడ్డారు. ఇక్కడ దారుణం ఏంటంటే.. చంద్రశేఖర్‌కు గుండె జబ్బు ఉంది. నోటీసుల ఒత్తిడి తట్టుకోలేక అతడు కూడా అనారోగ్యం పాలయ్యాడు. ప్రస్తుతం నాగ్‌పూర్‌లో చికిత్స చేయించుకుంటున్నాడు. అందరూ ఆస్పత్రుల పాలుకావటంతో ఆర్థికంగా మరింత చితికిపోయాడు. ఈ దారుణానికంతటికీ కారణం ఓ లాండ్.. ఆ లాండ్ చంద్రశేఖర్ పేరు మీద ఉన్నట్లు ఆదాయ పన్ను శాఖ పొరపడింది. నోటీసులు పంపింది. ఈ నేపథ్యంలో మున్సిపల్ అధికారులు వెరిఫికేషన్ మొదలుపెట్టింది. ఆ లాండ్ అతడి పేరు మీద లేదని తేల్చింది. ఇదే విషయాన్ని ఆదాయ పన్ను శాఖకు పంపింది. దీంతో చంద్రశేఖర్ కుటుంబం ఊపిరి పీల్చుకుంది.


ఇవి కూడా చదవండి:

Exam Paper Evaluation: ఇక ఆ పిల్లలు పాసైనట్లే.. ఫ్యూన్‌తో పేపర్ కరెక్షన్..

WhatsApp: వాట్సాప్ యూజర్లకు హెచ్చరిక.. సైబర్ అటాక్‌కు అవకాశం..

చదువు సంస్కారం లేదా

Updated Date - Apr 10 , 2025 | 12:04 PM