Ramdev Sherbet Jihad controversy: రామ్‌దేవ్ బాబా షర్బత్ జీహాద్ వ్యాఖ్యలు వివాదాస్పదం.. ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం
ABN , Publish Date - Apr 22 , 2025 | 01:59 PM
రామ్‌దేవ్ బాబా షర్బత్ జీహాద్ వ్యాఖ్యలపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి వ్యాఖ్యలు మళ్లీ చేయబోనంటూ హామీ పత్రం ఇవ్వాలని ఆదేశించింది.

ఇంటర్నెట్ డెస్క్: పతంజలి ఆయుర్వేద సంస్థ వ్యవస్థాపకులు రామ్‌దేవ్ బాబా చేసిన షర్బత్ జీహాద్ వ్యాఖ్య వివాదాస్పదమయ్యింది. రూ అఫ్జా పానీయాన్ని ఉద్దేశించి షర్బత్ జీహాద్ అంటూ రామ్‌దేవ్ బాబా చేసిన కామెంట్ ఏమాత్రం సమర్థనీయం కాదని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ కామెంట్స్ కోర్టును తీవ్రంగా ప్రభావితం చేశాయని వెల్లడించింది. రూ ఆఫ్జా పానీయం తయారీదారు హమ్‌దర్ద్ వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
తమ కొత్త పానీయం రోజ్ షర్బత్ ప్రచారం కోసం రామ్‌దేవ్ బాబా ఇటీవల ఓ కొత్త వీడియో విడుదల చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘షెర్బత్‌గా అమ్మగా వచ్చిన డబ్బుతో ఓ సంస్థ మసీదులు, మద్రసాలు నిర్మిస్తోంది. మీరూ ఆ షెర్బత్ తాగితే మసీదులు, మద్రసాలు నిర్మితమవుతాయి. కానీ మీరు పతంజలి రోజ్ షర్బత్ తాగితే గురుకులాలు, పతంజలి యూనివర్సిటీ నిర్మితమవుతాయి. లవ్ జీహాద్, వోట్ జీహాద్ లాగా షర్బత్ జీహాద్ కూడా కొనసాగుతోంది’’ అని రామ్‌దేవ్ బాబా అన్నారు. దీనిపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో తాను ఏ సంస్థ పేరు ప్రస్తావించలేదని రామ్‌దేవ్ బాబా వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో రూ అఫ్జా పానీయం తయారీదారు హమ్‌దర్ద్ సంస్థ కోర్టుకెక్కింది. ఆ వీడియోను తొలగించేలా ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేసింది.
మరోవైపు, పతంజలి తరుపున విచారణకు హాజరైన ప్రాక్సీ కౌంన్సెల్ కోర్టును వాయిదా కోరారు. ప్రధాన లాయర్ రానందున విచారణ వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. అయితే, కోర్టు ఇందుకు నిరాకరించింది. మధ్యాహ్నానికి కల్లా పతంజలి ప్రధాన లాయర్ కోర్టులో హాజరు కావాల్సిందేనని జస్టిస్ బన్సల్ స్పష్టం చేశారు. లేకపోతే తీవ్రమైన ఆదేశాలు ఇస్తామని స్పష్టం చేశారు. ఆ తరువాత విచారణకు హాజరైన ప్రధాన లాయర్.. పతంజలి సంస్థ ఆ ప్రకటనను ఉపసంహరించుకుంటుందని తెలిపారు. హమ్‌దర్ద్‌ను ఇబ్బంది పెట్టే ఇలాంటి ప్రకటనలను మరోసారి జారీ చేయబోమంటూ హామీ ఇవ్వాలని కూడా జస్టిస్ బన్సల్ స్పష్టం చేశారు. వారంలోపల అఫిడవిట్ దాఖలు చేయాలంటూ విచారణను మే1కి వాయిదా వేశారు.
ఇవి కూడా చదవండి:
బెంగళూరులో బైకర్, ఎయిర్‌ఫోర్స్ అధికారి మధ్య ఘర్షణ.. కేసులో ఊహించని ట్విస్ట్
ఇప్పటికే మాపై విమర్శలు.. తొలిసారిగా స్పందించిన సుప్రీం కోర్టు
పాడుబడ్డ ఇంట్లో అనాథ చిన్నారి.. కాపాడిన నటి దిశా పటానీ సొదరి