Share News

Most Trusted Leader Modi: ప్రపంచంలో అత్యంత విశ్వసనీయ నేతగా ప్రధాని మోదీ

ABN , Publish Date - Jul 26 , 2025 | 01:11 PM

ప్రపంచంలో అత్యంత విశ్వసనీయ నేతగా ప్రధాని మోదీ నిలిచారు. మార్నింగ్‌ కన్సల్ట్‌ సంస్థ గ్లోబల్‌ లీడర్‌ సర్వేలో 75 శాతం రేటింగ్స్‌తో ఆయన మరోసారి నెం.1గా నిలిచారు.

Most Trusted Leader Modi: ప్రపంచంలో అత్యంత విశ్వసనీయ నేతగా ప్రధాని మోదీ
PM Modi global approval

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచంలో అత్యంత విశ్వసనీయ నేతగా ప్రధాని మోదీ మరోసారి టాప్‌లో నిలిచారు. మార్నింగ్‌ కన్సల్ట్‌ సంస్థ గ్లోబల్‌ లీడర్‌ సర్వేలో మరోసారి తన ఆధిక్యాన్ని నిలుపుకున్నారు. సర్వేలో ప్రధాని మోదీకి అత్యధిక శాతం మంది మద్దతు ప్రకటించడంలో అప్రూవల్ రేటింగ్స్ ఏకంగా 75 శాతానికి చేరాయి. ఈ ఏడాది జులై 4 నుంచి 10 తేదీల మధ్య సర్వేను నిర్వహించారు.

ఈ సర్వేలో ప్రధాని నెం.1గా నిలవడంపై బీజేపీ సీనియర్ నేత అమిత్ మాల్వీయ సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేశారు. భారతీయులతో పాటు ప్రపంచవ్యాప్తంగా మిలియన్‌ల మంది ప్రజల గౌరవాభిమానాలు చూరగొన్న నేతగా ప్రధాని నిలిచారని అన్నారు. అత్యధిక అనుకూల రేటింగ్స్ కలిగిన నేతగా ఉన్నారంటూ ప్రశంసల్లో ముంచెత్తారు. బలమైన నాయకత్వం, ప్రపంచవ్యాప్తంగా గౌరవాభిమానాలు పొందే నేత సారథ్యంలో భారత్ భద్రంగా ఉందని కామెంట్ చేశారు.


మార్నింగ్ కన్సల్ట్ నిర్వహిస్తున్న సర్వేల్లో మోదీ 2021 నుంచి ప్రథమస్థానంలోనే కొనసాగుతున్నారు. సర్వేల్లో ప్రధానికి మద్దతుగా నిలుస్తున్న వారి సంఖ్య 70 శాతానికి పైగానే ఉంటోంది. 2022 సర్వేలో కూడా 13 ప్రపంచం నేతల్లో జనాదరణ పరంగా ప్రధాని టాప్‌లో నిలిచారు. ఇక 2023 నాటి సర్వేలో ఆయన అప్రూవల్ రేటింగ్స్ 76 శాతానికి ఎగబాకాయి. గతేడాది ఫిబ్రవరిలో జరిగిన సర్వేలో విశ్వసనీయత రేటింగ్స్ గరిష్ఠంగా 78 శాతాన్ని తాకాయి.

ఇక తాజా సర్వేలో ప్రధాని తర్వాతి స్థానంలో దక్షిణ కొరియా నేత లీ జే మ్యూంగ్ ఉన్నారు. 59 శాతం అప్రూవల్ రేటింగ్స్‌తో రెండో స్థానంలో నిలిచారు. ఆ తరువాతి స్థానాల్లో అర్జెంటీనా నేత జేవియర్ మైలీ (57 శాతం), కెనడా అధినేత మార్క్ కార్నీ (56 శాతం) ఉన్నారు. ఇక ఈ జాబితాలో 44 శాతం అప్రూవల్ రేటింగ్స్‌తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎనిమిదో స్థానంలో నిలిచారు.


ఇవి కూడా చదవండి:

కార్గిల్ విజయ్ దివస్.. అమర వీరులకు రాష్ట్రపతి, ప్రధాని నివాళి

మాజీ ఉపరాష్ట్రపతికి టైప్ 8 బంగళా కేటాయించిన కేంద్రం.. అసలు ఇదేంటంటే..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 26 , 2025 | 01:27 PM