Padma Vibhushan Awardees 2025: ఏడుగురు పద్మ విభూషణులు వీళ్లే..
ABN , Publish Date - Apr 28 , 2025 | 08:35 PM
అసాధారణమైన, విశిష్ట సేవలకు 'పద్మ విభూషణ్'ను ప్రదానం చేస్తారు. ఈ ఏడాది ఏడుగురికి ఈ అత్యున్నత అవార్డు ప్రదానం చేశారు. వీరిలో ముగ్గురికి మరణానంతరం ఈ పురస్కారం దక్కింది.

Padma Vibhushans 2025: పద్మ అవార్డులు భారత దేశ అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటి. పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ అనే మూడు విభాగాలలో వీటిని ప్రదానం చేస్తారు. వివిధ రంగాల్లో అత్యున్నత ప్రతిభ కనబరిచిన వాళ్లకి ఈ అవార్డులిస్తారు. అసాధారణమైన, విశిష్ట సేవలకు 'పద్మ విభూషణ్'ను ప్రదానం చేస్తారు. ఉన్నత స్థాయి విశిష్ట సేవలకు 'పద్మభూషణ్', ఏ రంగంలోనైనా విశిష్ట సేవలందించిన వారికి 'పద్మశ్రీ' అవార్డులు ప్రదానం. 2025 సంవత్సరానికి గారు అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్ ఈ ఏడాది ఏడుగురికి వచ్చింది. వారి వివరాలు చూద్దాం.
పద్మవిభూషణ్ పొందిన ఏడుగురిలో..
1. తెలంగాణకు చెందిన దువ్వూరు నాగేశ్వర్ రెడ్డి(వైద్యం)
2. చండీగఢ్ కు చెందిన జస్టిస్ (రిటైర్డ్) జగదీష్ సింగ్ ఖేహర్ (ప్రజా వ్యవహారాలు)
3. గుజరాత్ కు చెందిన శ్రీమతి కుముదిని రజనీకాంత్ లఖియా (కళలు)
4. కర్ణాటకకు చెందిన శ్రీ లక్ష్మీనారాయణ సుబ్రమణ్యం(కళలు)
5. కేరళకు చెందిన M. T. వాసుదేవన్ నాయర్ (మరణానంతరం) విద్య, సాహిత్య రంగం
6. జపాన్ కు చెందిన ఒసాము సుజుకి (మరణానంతరం) పరిశ్రమలు, వాణిజ్యం
7. శ్రీమతి శారదా సిన్హా (మరణానంతరం) (కళలు) ఉన్నారు.